YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జనపేనకు భారీ ఊరట

జనపేనకు భారీ ఊరట

విజయవాడ, ఏప్రిల్ 16
ఎన్నికల ముందు జనసేన పార్టీకి భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్.. జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంపై ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయగా విచారణ అనంతరం తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా, జనసేనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీనిపై జనసైనికులు హర్షం వ్యక్తం చేశారు. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తునుకేటాయించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేశారు. అలాగే, ఈసారి కూడా గాజు గ్లాస్ గుర్తుపైనే ఆ పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీలో నిలవనున్నారు.
జనసేనకు గుర్తు కేటాయింపుపై కోర్టుకు
అయితే, జనసేనకు గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించడంపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) పార్టీ అభ్యంతరం తెలిపింది. ఆ పార్టీకి కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసింది. ఫ్రీ సింబల్ గా ఉన్న గాజు గ్లాసు గుర్తు కోసం తొలుత తాము దరఖాస్తు చేశామని.. అయితే ఎన్నికల సంఘం గుర్తును జనసేనకు కేటాయించిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ పిటిషన్ లో పేర్కొన్నారు.  జనసేనకు కేటాయించిన గుర్తును రద్దు చేయాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆ పిటిషన్ ను కొట్టేస్తూ జనసేనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది

Related Posts