YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో వారసులొస్తున్నారు...

 ఏపీలో వారసులొస్తున్నారు...

తిరుపతి, ఏప్రిల్ 19
ఎన్నికల్లో రాజకీయ వారసులు హాట్ టాపిక్. అన్ని పార్టీల నుంచి చాలామంది వారసులు బరిలో దిగారు. ప్రధానంగా వైసీపీ నుంచి చాలామంది వారసులకు టికెట్లు లభించాయి. తాము యాక్టివ్ గా ఉన్న సమయంలోనే వారసులకు లైన్ క్లియర్ చేయాలని చాలామంది నేతలు భావించారు. తమ పలుకుబడిని ఉపయోగించుకుని టిక్కెట్లు దక్కేలా చేశారు. అయితే ఇలా బరిలో దిగిన వారసులు గెలుపొందుతారా? లేదా? అన్న బలమైన చర్చ నడుస్తోంది.అధికారపక్షం వైసిపి తో పాటు టిడిపి నుంచి పెద్ద ఎత్తున వారసులు బరిలో దిగారు. అధికార వైసీపీ నుంచి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, బందరు ఎమ్మెల్యే పేర్ని నాని కుమారుడు కృష్ణమూర్తి, రామచంద్రపురం ఎమ్మెల్యే పిల్లి సుభాష్ కుమారుడు సూర్యప్రకాష్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె ఫాతిమాకు వైసిపి హై కమాండ్ అవకాశం ఇచ్చింది. అయితే ఇందులో గుంటూరు, బందరు వరకు పరవాలేకున్నా.. చంద్రగిరి,తిరుపతి, రామచంద్రపురంలో ఇబ్బందికరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ వారు టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్నట్లు సమాచారం.తెలుగుదేశం పార్టీకి సంబంధించి కోవూరు నుంచి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి, ప్రత్తిపాడు నుంచి ఇటీవల మృతి చెందిన పరుపుల రాజా సతీమణి సత్యప్రభ, వెంకటగిరి నుంచి మహిళా కోటాలో మాజీ ఎమ్మెల్యే కోరుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మి ప్రియ, శ్రీకాళహస్తి నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి, కమలాపురం నుంచి పుత్తా నరసింహారెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి, పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు సింధూర రెడ్డి, కదిరి నుంచి మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ సతీమణి యశోదాదేవి పోటీ చేస్తున్నారు. వీరు సైతం వైసీపీ అభ్యర్థుల నుంచి గట్టి ఫైట్ ఎదుర్కొంటున్నారు. ప్రచార పర్వంలో బిజీగా ఉన్నారు. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మరి ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.

Related Posts