YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇంటర్ ఫలితాలు.. ఏడుగురు విద్యార్థుల ఆత్మహత్య

ఇంటర్ ఫలితాలు.. ఏడుగురు విద్యార్థుల ఆత్మహత్య

హైదరాబాద్, ఏప్రిల్ 25
తెలంగాణ లో  ఇంటర్ ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాము పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఆరుగురు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్య చేసకోవడం కలకలం రేపింది. మరో విద్యార్థిని ఫెయిలవుతానననే భయంతో ఫలితాలకు ముందే బలవన్మరణానికి పాల్పడింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూర్‌కు చెందిన సాయితేజ గౌడ్ (17), హైదరాబాద్‌ అత్తాపూర్‌కు చెందిన హరిణి, ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన వాగదాని వైశాలి, మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన చిప్పా భార్గవి, మంచిర్యాల జిల్లా దొరగారిపల్లెకు చెందిన గట్టిక తేజస్విని, మంచిర్యాల జిల్లా తాండూర్‌ మండలం అచ్చులాపూర్‌ గ్రామానికి చెందిన మైదం సాత్విక్‌.. వీళ్లందరూ కూడా ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పతూరు గ్రామానికి చెందిన శ్రీజ అనే ఒకేషనల్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని.. ఫెయిలవుతాననే భయంతో మంగళవారం రాత్రి పురుగుల మందు తాగింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. కానీ పరీక్ష ఫలితాలు చూస్తే ఆమె పాసైంది. ఇంటర్ ఫలితాల వల్ల రాష్ట్రంలో ఇలా ఏడుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడంటతో వాళ్ల కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చారు.

Related Posts