YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మూగజీవాలకు నీరు ఎలా

మూగజీవాలకు నీరు ఎలా

కరీంనగర్, ఏప్రిల్ 25
కరీంనగర్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. పొద్దు పొద్దున్నే నిప్పులు కక్కుతూ ఉదయిస్తున్న సూర్యుడు.. మధ్యాహ్నం వరకు మాడు పగిలిపోయేలా మండుతున్నాడు. ఉదయం 10 దాటితే బయటకి రావాలంటే జంకుతున్నారు జనం. జనజీవనమే ఎండల ధాటికి తట్టుకోలేక పోతుంటే, నోరు లేని మూగ జీవాల పరిస్థితి దారుణంగా మారింది.హైదరాబాద్ మహానగరంలోని లోయర్ మానేరు డ్యామ్ సమీపంలో ఉన్న జింకల పార్క్‌లో వన్య ప్రాణులు ఎండలతో అల్లాడుతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో డీర్ పార్క్ లో ఉన్న జంతువులు, పక్షులు, ఇతర జీవాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. పార్క్ లో కృష్ణ జింకలు, చుక్కల దుప్పి, నీల్ గాయి లాంటి జంతువులతో పాటు నెమళ్ళు, అడవి కోళ్లు, రామ చిలుకలు, ఆఫ్రికన్ చిలుకలు, క్లోనింగ్ రాట్స్, కుందేళ్లు, యూరోపియన్ పిగ్స్ లాంటి వందలాది జంతుజాలం ఉంది. పక్షులతో పాటుగా జంతువులు, కోసం ప్రత్యేకంగా షెడ్లు నిర్మించారు. జింకల కోసం ఓపెన్ ప్లేస్ లో చెట్ల నీడ ఉండేలా ఏర్పాట్లు చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని పళ్ళు కూరగాయలతో పాటుగా ప్రత్యేకమైన అహారాన్ని అందిస్తున్నారు.వన్యప్రాణులు నివసించే షెడ్ లలో క్రింద ఇసుక పోసి చుట్టూ గోనె సంచులు ఏర్పాటు చేశారు. ఎండ వేడి తగలకుండా నీటితో తడుపుతూ రోజుకి మూడు సార్లు చల్లబరుస్తు ఉపశమనం కలిగిస్తున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ విదేశాల నుంచి తెచ్చిన కొన్ని ప్రాణులు ఇక్కడి ఉష్ణోగ్రతలను తట్టుకోలేక పోతున్నాయి. ఏప్రిల్ నెలలోనే ఈ పరిస్థితి ఉంటే మరో 40 రోజుల పాటు మరింత ఎక్కువ ఎండలు కాసే అవకాశాల ఉన్నాయి.. అరుదైన జీవులను రక్షించడం అధికారుల కు కత్తి మీద సాముగా మారిందని చెప్పవచ్చు

Related Posts