YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రతి ఇంటికి నేనే డాక్టర్ అవుతా - ఆది మూలపు సతీష్

ప్రతి ఇంటికి నేనే డాక్టర్ అవుతా - ఆది మూలపు సతీష్

సి.బెళగల్ మండలం గుండ్రేవుల, యనగండ్ల గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కుడా చైర్మన్  కోట్ల హర్షవర్ధన్ రెడ్డి  మరియు కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలవు సతీష్ .వీరికి ఘన స్వాగతం పలికిన గ్రామ వైసిపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు..
ఈ సందర్భంగా కుడా చైర్మన్  కోట్ల హర్షవర్ధన్ రెడ్డి  మరియు కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలవు సతీష్  మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మంచి జరిగిందని అన్నారు.. జగనన్న అంటే మన నమ్మకం అని, జగనన్ననే మన భవిష్యత్తు అని అన్నారు.. గత టిడిపి ప్రభుత్వంలో పథకాలు లబ్ధిపొందాలంటే మధ్యవర్తులకు లంచాలు ఇచ్చేవారని, కానీ ఇప్పుడు అలాంటిది లేకుండా అర్హులైన లబ్దిదారులకు ఇంటికే నెరుగా పథకాలు వస్తున్నాయని అన్నారు.. జగనన్న పథకాలు ప్రతి ఇంటికి చేరాయని అని అన్నారు.. జగనన్న ప్రభుత్వంలో చిన్న, పెద్ద, కులం, మతం తేడా లేకుండా అందరికీ మంచి జరిగిందని అన్నారు.. అలాగే వైద్యం విషయంలో అర్థరాత్రి అయినా తనను కలవవచ్చని, ప్రతి ఇంటికి నేనే డాక్టర్ ను అవుతానని డా.ఆదిమూలపు సతీష్ గారు అన్నారు.. మరియు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా జగనన్న నాయకత్వం లో అభివృద్ధి చేస్తానని అన్నారు.. అలాగే గ్రామంలో ఎదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే గెలిచిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు..
రానున్న మే13 జరిగే ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా ఆదిమూలపు సతీష్ కి, ఎంపీగా బివై రామయ్య కి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మున్నెప్ప, మండల కన్వీనర్ సోమశేఖర్ రెడ్డి, గుండ్రేవుల సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, యనగండ్ల సర్పంచ్ ఇమ్మానీయేలు,నాగప్ప,బోయ రాజు,ఎస్ఎం భాష, కో ఆప్షన్ నెంబర్ హారన్, రాధాకృష్ణారెడ్డి, పోలకల్ ప్రభాకర్ రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, టీజీ వెంకటేష్, మాధవరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, మనోహర్ రెడ్డి, నాగప్ప, రాజు, చెరువుపల్లి సర్పంచ్ భాను ప్రకాశ్ రెడ్డి, సి.బెళగల్ సర్పంచ్ పాండురంగన్న, గోవర్ధన్ రెడ్డి, తులసి రెడ్డి, మాజీ సర్పంచ్ చంటన్న, బాయికాటి మద్దిలేటి, పులి రాజు,  శాంతిరాజు, నాగేష్, రంగన్న, సోమప్ప, శేఖర్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు

Related Posts