YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అంగన్వాడీ కార్యకర్తలకు డ్యూటీలు

అంగన్వాడీ కార్యకర్తలకు డ్యూటీలు

నెల్లూరు, ఏప్రిల్ 29 
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు విధులను బదలాయించిన ఎన్నికల సంఘం.. తాజాగా మరో నిర్ణయాన్ని తీసుకుంది. రానున్న ఎన్నికల్లో అంగన్వాడీలు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సేవలను ఎన్నికలకు వినియోగించుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 25 పార్లమెంట్‌, 175 అసెంబ్లీ స్థానాలలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది కొరత ను అధిగమించేందుకు ఎన్నికల సంఘం.. అంగన్వాడీ సిబ్బంది, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పోలింగ్‌ విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. వీరిని ఓపీవోలుగా నియమించాలని జిల్లా స్థాయిలోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. అదే సమయంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే అన్ని కేటగిరీల వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఫాం 12 డి జారీ గడువును మే ఒకటో తేదీ వరకు పొడిగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్రంలో పింఛన్ల పంపిణీకి ఇబ్బందుల్లేకుండా చూడాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల్‌ కోడ్‌ అమలు దృష్ట్యా లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా చూడాలని కోరింది. పింఛన్‌ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను మార్చి 30న జారీ చేసినట్టు ఈసీ వెల్లడించింది. ఈ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని సీఎస్‌ జవహర్‌రెడ్డికి ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తరువాత వాలంటీర్లు పూర్తిగా పింఛన్ల పంపిణీకి దూరమయ్యారు. దీంతో పింఛన్లదారులకు ఇంటింటికీ వెళ్లి పెన్షన్‌ ఇవ్వడం లేదు. దీనివల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తీసుకోవాల్సి రావడం, అది కూడా ఆలస్యం అవుతుండడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ తరహా ఇబ్బందుల్లేకుండా పింఛన్ల పంపిణీపై దృష్టి సారించాల్సిందిగా ఎన్నికల సంఘం సీఎస్‌ను ఆదేశించింది. చూడాలి మరి సీఎస్‌ పింఛన్ల పంపిణీకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారో.

Related Posts