
గోదావరిఖని :
రామగుండం నియోజకవర్గం గత పాలకుల తో పది సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోక రామగుండం ప్రాంతాన్ని బొందల గడ్డగా మార్చారు. రామగుండం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ నుండి అత్యధిక మెజార్టీతో గెలిచిన రాజ్ ఠాగూర్ మక్కాన్సింగ్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు రామగుండం అభివృద్ధి కోసం పనులు చేసుకుంటూ పోతున్నారు.
ఆపరేషన్ పోచమ్మ.
మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న అక్రమంగా కొందరు బడా నాయకులు అధికార బలంతో మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా రూములను వేసి కిరాయిలు వసూలు చేస్తున్నారు. ఆపరేషన్ పోచమ్మ పేరుతో రామగుండం ఎమ్మెల్యే మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు రాత్రి అక్రమ కట్టడాలను కూల్చి వేశారు. అక్రమ కట్టడాల కూల్చడం పట్ల రామగుండం ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రామగుండంలో ముగ్గురు బడా నాయకులు అక్రమ రూములను కూల్చి వేయడం పట్ల రామగుండం ప్రజలు మున్సిపల్ అధికారులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు
300 కోట్లతో రామగుండం అభివృద్ధి దిశగా.
300 కోట్లతో రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా రామగుండం ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆర్సిఓ క్లబ్ నుండి సింగరేణి కోటర్స్ ను తొలగించడం కాకుండా తొలగించిన స్థానంలో షాపింగ్ కాంప్లెక్స్ లో షాపులో కోల్పోయిన వారికి షాపులు కేటాయించడానికి పూనుకున్నట్లు సమాచారం. ఆర్ సి ఓ క్లబ్ నుండి స్థానిక ప్రధాన చౌరస్తా వరకు 100 ఫీట్ల రోడ్డు,
కళ్యాణ్ నగర్,లక్ష్మీ నగర్ లోని స్థలం వెసులుబాటు గల్లీల ఆధారంగా కొన్ని కొన్ని ఏరియాలో 60 ఫీట్లు 80 ఫీట్లు చేసే ఆలోచన ఉన్నట్టు సమాచారం. అలాగే బుకోళ్ల షాపులు కూడా తొలగించే ఆలోచనలో ఉన్నట్లు ప్రజలనుకుంటున్నారు. అశోక్ నగర్ మసీదు దగ్గర నుండి రీగల్ షూ మార్ట్ వరకు 100 రోడ్డు, గణేష్ నగర్ నుండి నేరుగా లక్ష్మీ నగర్ వరకు ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసరాలు పరిస్థితిలో హాస్పటల్లో అంబులెన్స్ వెళ్లడానికి 100 నుండి 80 రోడ్డు వేయడానికి పూనుకున్నారు. అలాగే ముఖ్యంగా లక్ష్మీ నగర్, ప్రధాన చౌరస్తా, కళ్యాణ్ నగర్ వరకు రోడ్లు వెడల్పు, సెంట్రల్ లైటింగ్, ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. రామగుండంలో 50 డివిజన్లో డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలతో అభివృద్ధి శ్రీకారం.
రామగుండం అభివృద్ధికి సహకరిస్తాం.
రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి స్థానిక నాయకులు వ్యాపారస్తులు, న్యాయవాదులు, రామగుండం నియోజకవర్గం ప్రజలు ప్రాంత అభివృద్ధికి సహకరిస్తామని అంటున్నారు. అలాగే షాపులు కోల్పోయిన వారికి కొత్తగా నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ లో అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని స్థానిక ప్రజలు అనుకుంటున్నారు.