YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కన్సల్టెన్సీల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం

కన్సల్టెన్సీల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం
వ్యవసాయ శాఖ  కేపీఎంజీ అనే  ఏజెన్సీ ని సలహాదారుగా నియమించించిది.  రైతులకు సలహాలు ఇవ్వడానికి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి కోట్ల రూపాయలు చెల్లిస్తారా అని వైకాపా రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రశ్నించారు. బుధవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు.  గతంలో చంద్రబాబు మెకెన్సీ సంస్థకు ఇలాగే ఇచ్చారు, ఇప్పుడు అదే బాటలో సాగుతున్నారు.  క్షేత్రస్థాయిలో అనుభవం ఉన్న శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ఉండగా ఏజెన్సీలకు కట్టబెట్టడం దారుణమని అన్నారు. వైఎస్సార్  హయాంలో వ్యవసాయం పండుగలా సాగింది, బాబు పాలనలో దండుగలా మారింది.  వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి మద్దతు ధర గురుంచి ఎప్పుడైనా కేంద్రాన్ని నిలదీశారా అని అడిగారు. నాలుగు  ఏళ్ళు కేంద్రంలో భాగస్వామి గా ఉండి రైతులకు ఏం చేశారని ప్రశ్నించారు.  కన్సల్టెన్సీల పేరుతో వందల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. కేసీఎంజీ  చరిత్ర వెలికితీస్తే లోకేష్, సోమిరెడ్డి పేర్లు బయటికి వస్తాయని అయన అన్నారు.  ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? వృద్ధిరేటు బావుంటే అంతర్జాతీయ కన్సల్టెన్సీల అవసరం ఎందుకు?   చంద్రబాబు ఇప్పటికైనా రైతుల ప్రయోజనాల కోసం పాటుపడని సూచించారు.

Related Posts