YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రెట్రో... ఢమాల్... హిట్... బాక్సాఫీసు బొనంజా

రెట్రో... ఢమాల్... హిట్... బాక్సాఫీసు బొనంజా

హైదరాబాద్, మే 4, 
మే డే సందర్భంగా తమిళ హీరో సూర్య  నటించిన ‘రెట్రో' మన టాలీవుడ్ నుండి నేచురల్ స్టార్ నానినటించిన ‘హిట్ 3చిత్రాలు భారీ అంచనాల నడుమ విడుదలైన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ రెండు సినిమాలలో రెట్రో కి పబ్లిక్ నుండి కాస్త డివైడ్ టాక్ వచ్చింది. కానీ నాని ‘హిట్ 3’ చిత్రానికి మాత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు రెట్రో చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 34 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, నాని ‘హిట్ 3’ చిత్రానికి 43 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మీడియం రేంజ్ హీరోలలో నాని ఈ చిత్రం ద్వారా ఆల్ టైం రికార్డు ని నెలకొల్పితే, స్టార్ హీరో అయినప్పటికీ సూర్య నాని కంటే తక్కువ ఓపెనింగ్ ని రాబట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.రెండవ రోజు ట్రెండ్ ని గమనిస్తే రెట్రో చిత్రం వసూళ్లు దారుణంగా పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు నుండే ఊపు లేదు, కానీ తమిళనాడు లో కూడా భారీ డ్రాప్స్ ని సొంతం చేసుకోవడం చూసుంటే సూర్య కెరీర్ లో ఈ చిత్రం మరో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచే అవకాశం ఉంది. ‘హిట్ 3’ ఈ వీకెండ్ లోపు బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకోనుంది. మరోపక్క రెట్రో చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 68 కోట్ల రూపాయిల షేర్ రాబట్టాలి. అది దాదాపుగా అసాధ్యం అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ప్రస్తుతం బుక్ మై షో యాప్ లో నాని ‘హిట్ 3’ చిత్రానికి గంటకు 12 వేల టికెట్స్ అమ్ముడుపోతుంటే, సూర్య రెట్రో చిత్రానికి గంటకే 7 వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయి.అంటే దాదాపుగా ‘హిట్ 3’ లో సగం ఉంది అన్నమాట. ఓవరాల్ గా బుక్ మై షో లో రెండవ రోజు
‘రెట్రో’ చిత్రానికి లక్షకు పైగా టికెట్స్ అమ్ముడుపోగా, ‘హిట్ 3’ చిత్రానికి రెండు లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. రేపు, ఎల్లుండి వీకెండ్ కాబట్టి, ఈ రెండు రోజులు కూడా భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. ‘రెట్రో’ కూడా వీకెండ్ వరకు డీసెంట్ స్థాయి వసూళ్లను వస్తాయి, కానీ అది బ్రేక్ ఈవెన్ కి ఎంత వరకు దగ్గరగా ఉంటుందో చూడాలి. రేపటికి కూడా హిట్ 3 అడ్వాన్స్ బుకింగ్స్ చాలా సాలిడ్ గా ఉన్నాయి.  ‘రెట్రో’ అడ్వాన్స్ బుకింగ్స్ యావరేజ్ రేంజ్ లో ఉన్నాయి. రెండవ రోజు హిట్ 3 కి 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉండగా, ‘రెట్రో’ చిత్రానికి 12 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Related Posts