
నల్గోండ
పదేళ్ల బిఆరెస్ పాలన -పదహారు నెలల కాంగ్రెస్ పాలన పై ప్రజల్లో భిన్న స్వరాలు వినిపిస్తిన్నాయి. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన సాగు నీటి ప్రాజెక్టులు నాణ్యత లోపం తో కూలి ఇప్పుడు ఇలా శిథిలావస్థకు చేరుకుంటున్నాయని కాంగ్రెస్ మంత్రులు బిఆరెస్ పై బాణాలు ఎక్కు పెట్టారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ లకు ప్రజా ధనం దుర్వినియోగం అయ్యిందని మంత్రులు మండి పడుతున్నారు. కాలేశ్వరం ప్రాజెక్టును బిఆరెస్ అప్పటి తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా చెప్పుకున్నా... ఇప్పుడు అవినీతి నిండిపోయిందనే ఆరోపణలు కాంగ్రెస్ చేస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం 94 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా . ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదని వాదన వినిపిస్తుంది. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఎక్కువ దృష్టి పెట్టి, దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందనని ఆరోపిస్తున్నారు.
పనికిరాని కాలేశ్వరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం 94 వేల కోట్లను ఖర్చు పెట్టింది. వాళ్ల టైం లోనే డిజైనింగ్ అయింది, వాళ్ల టైంలోనే పూర్తి చేశారు,వాళ్ల టైంలోనే కూలిపోయిందని బిఆరెస్ పై విరుచుకు పడుతున్నారు.
"గత పదేళ్లలో ఇరిగేషన్ శాఖ 1లక్షా81 వేల కోట్లు ఖర్చుపెట్టి ఎస్ ఎల్ బి సి , దేవాదుల, పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి ,నెట్టెంపాడు, భీమ లాంటి ప్రాజెక్టులు 1 పర్సెంటేజ్ కూడా పూర్తి చేయలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఏదో విధంగా ఈ ఎస్ ఎల్బీ సి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. చాలాకాలం కింద ఆగిపోయిన గందమల్ల ప్రాజెక్టును కూడా తిరిగి ప్రారంభిస్తున్నాం. మేము వచ్చిన తర్వాతనే ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులను పురోగతి సాధించి ముందుకు తీసుకుపోతున్నాము. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఏ విధంగా ఎక్కువ ఆయకట్టు స్టిరీకరణ సాధించెలా చర్యలు చేపడతాం.పదేళ్ల బిఆరెస్ పాలన లో"దక్షణ తెలంగాణ ప్రాజెక్ట్ లకు తీరని అన్యాయం జరిగిందని తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు..
యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతో... రైతులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత... ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మన జిల్లాలో 80% ధాన్యాన్ని కొనుగోలు చేశాం. తప్పకుండా మీ సమస్యలలో మేము ఒకడిగా ఉంటామని మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత... 80 నుంచి 84 శాతం జనాభాకు ఉచితంగా ఆరు కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం 13 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందడంతో లబ్ధిదారులు ఈ పథకం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మంత్రి స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నిటిలో సన్న బియ్యం పథకం నాకు చాలా నచ్చిందంటున్న మంత్రి గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యం 80 శాతం పక్కదారి పట్టాయన్నారు. కానీ ఈరోజు ప్రతి షాపు లో నాలుగు రోజులలోనే సన్న బియ్యం బియ్యం అయిపోతుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం... కాలేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు చేస్తుంటే, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ రాజకీయ ఆరోపణలు, ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. మిర్యాలగూడ లో జరిగిన మీటింగ్ లో కోమటిరెడ్డి మాట్లాడుతూ, ఓ పెద్దాయన అంటాడు తెలంగాణకు మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీ ఏ అని. పదేళ్లు ఫామ్ హౌస్ లో పడుకొని లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డాయన కాంగ్రెస్పై నిందలు వేయడం సరికాదని మంత్రి హితవు పలికారు..
తెలంగాణ లో ప్రాజెక్టు అవినీతి గుట్టలు.. బయటపడుతున్న కొద్దీ...కాంగ్రెస్, బిఆరెస్ నేతల మధ్య రాజకీయ ఆరోపణలు పెరుగుతున్నాయి.రోజు రోజు కు రాజకీయం వేడెక్కుతుంది. సంక్షేమ పథకాల అమలు పై బిఆరెస్ నిలదీస్తుంది.ఆరోపణలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందా? ప్రజలకు న్యాయం జరుగుతుందా? తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులు, ప్రజల ఆశలు, రాజకీయ నాయకుల అవినీతి... ఈ కథకు ముగింపు ఎప్పుడు?వేచి చూడాల్సి ఉంది.