
హనుమకొండ
ప్రసవమైన మహిళ కడుపులో వైద్యులు నిర్లక్ష్యంతో కాటన్ ప్యాడ్స్ మరిచిపోయారని సదరు బాలింత కుటుంబ సభ్యులు ఆరోపించారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రాణాపాయస్థితిలో మహిళ వుందని ఆరోపించారు.
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఘటన,
గత వారం రోజుల క్రితం మండల కేంద్రంలోనీ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన ఉప్పల్ గ్రామానికి చెందిన తిరుమల అనే మహిళ డెలివరీ సమయంలో వైద్యులు క్లాత్ అందులోనే వుంచి కుట్లు వేయడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. కడుపు నొప్పితో మళ్ళీ ఆసుపత్రికి వచ్చింది. చాలా సేపటివరకు వైద్యులు ఎవరు రాకపోగా హాస్పిటల్ ఆయవైద్యం చేసింది. అందుబాటులో లేని వైద్యులు, ఫోన్ కాల్ ద్వారానే వైద్య తతంగం సిబ్బంది నడిపిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చి మహిళా బంధువులు నిలదీయగా ఘటన వెలుగు చూసింది. డెలివరీ సమయంలో మొబైల్ ఫోన్లు మాట్లాడుతూ పట్టింపు లేకుండా వ్యవహరించారని బంధువుల ఆరోపణ.ఆసుపత్రి సూపరిండెంట్ నిర్లక్ష్య ధోరణి తోనే వైద్య సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.మరో ప్రాణం బలి కాకముందే ఆసుపత్రి ప్రక్షాళనకు చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.