YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇంటర్ సిటీకి అదనపు బోగీలు

ఇంటర్ సిటీకి అదనపు బోగీలు

విజయవాడ జూలై 22, 
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రయాణికుల సౌకర్యం, డిమాండ్‌ నేపథ్యంలో విజయవాడ - లింగంపల్లి- విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుకు అదనపు బోగీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ రైళ్లకు శాశ్వత ప్రాతిపదికన అదనపు బోగీలు అమర్చనున్నట్లు విజయవాడ రైల్వే డివిజనల్ కార్యాలయంలో ఓ ప్రకటనలో తెలిపింది. విజయవాడ లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌‍ప్రెస్ రైలుకు ఒక 3AC ఎకానమీ కోచ్.. అలాగే లింగంపల్లి విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుకు మరో 3AC ఎకానమీ కోచ్ ఏర్పాటు చేయనున్నారు. జూలై 26, 27 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.రైలు ప్రయాణికులకు శుభవార్త. విజయవాడ - లింగంపల్లి - విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుకు అదనపు బోగీలు ఏర్పాటు చేయనున్నారు ఈ విషయాన్ని విజయవాడ రైల్వే డివిజన్ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రయాణికుల సౌకర్యం కోసం, అలాగే ప్రయాణికుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను అనుసరించి రైలు నంబర్ 12795/96 విజయవాడ - లింగంపల్లి - విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు శాశ్వతంగా అదనపు కోచ్‌లు పెంచినట్లు విజయవాడ రైల్వే డివిజనల్ కార్యాలయం వెల్లడించింది. అదనపు బోగీలు ఏర్పాటు ద్వారా మరిన్ని సీట్లు, సౌకర్యవంతమైన, సుఖవంతమైన ప్రయాణానికి వీలు కలుగుతుందని తెలిపింది.12795 నంబర్ విజయవాడ - లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఒక 3AC ఎకానమి కోచ్ అమర్చనున్నారు.12796 నంబర్ లింగంపల్లి - విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఒక 3ఏసీ ఎకానమీ కోచ్ అమర్చనున్నారు. జూలై 26, జూలై 27వ తేదీల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని విజయవాడ రైల్వే డివిజనల్ కార్యాలయం వెల్లడించింది. మరోవైపు విజయవాడ - లింగంపల్లి - విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ జంక్షన్ రైల్వేస్టేషన్ నుంచి తెలంగాణలోని లింగంపల్లి మధ్య ప్రతిరోజూ అందుబాటులో ఉంటాయి. 2018లో వీటిని ప్రవేశపెట్టారు. ఏపీ రాజధాని ప్రాంతం.. హైదరాబాద్ మధ్య ప్రయాణించే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రైళ్లు సౌకర్యంగా ఉంటాయి.విజయవాడ - లింగంపల్లి- విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 336 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 5 గంటల 55 నిమిషాలలో చేరుకుంటాయి. లింగంపల్లి నుంచి ప్రతిరోజూ ఉదయం 4 గంటల 40 నిమిషాలకు లింగంపల్లి -విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (12796) రెలు బయల్దేరుతుంది. ఉదయం 10 గంటల 35 నిమిషాలకు విజయవాడ చేరుకుంటుంది. థర్డ్ ఎకానమీ (3E), చైర్ కార్ (CC), సెకండ్ సీటర్ (2S) కోచ్‌లు అందుబాటులో ఉన్నాయి. బేగంపేట్ , సికింద్రాబాద్ జంక్షన్, నల్గొండ, గుంటూరు జంక్షన్, మంగళగిరిలో ఈ రైలుకు స్టాపింగ్ ఉంది.

Related Posts