YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆగస్టు15న సీఆర్డీఏ సొంత భవనం ప్రారంభం

ఆగస్టు15న సీఆర్డీఏ సొంత భవనం ప్రారంభం

విజయవాడ జూలై 22, 
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆగష్టు 15న సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. రాజధాని ప్రాంతంలోని రాయపూడిలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన 3.62 ఎకరాల్లో ఏడు అంతస్తులతో ఈ భవనం నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇది నగర పాలనకు మరింత సులువుగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్న సీఆర్డీఏ కార్యాలయాన్ని మెప్మాకు అప్పగించనున్నారు.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలి శాశ్వత భవనం పనులు ముగింపు దశకు వచ్చాయి. తొలి భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.. ఈ మేరకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. అమరావతిలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని ఆగష్టు 15 నాటికి సిద్ధం చేయాలని ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం శాశ్వత భవనం ఆగష్టు 15న ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాయపూడిలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన సీఆర్డీఏ శాశ్వత భవనం నిర్మాణం జరుగుతోంది. ఈ మేరకు తొలి శాశ్వత భవనం ప్రారంభోత్సవానికి ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యాలయం అందుబాటులోకి వస్తే రాజధాని నగర పాలన మరింత సులువు అవుతుందని భావిస్తున్నారు.ఈ సీఆర్డీఏ శాశ్వత భవనం పనులు అనుకున్న సమయానికి పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఈ మేరకు మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గతేడాది అక్టోబరు 19న ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పునర్నిర్మాణ పనులను ఇక్కడి నుంచే ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పుడు చంద్రబాబు చేతుల మీదుగా ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆ పనులు ముగింపు దశకు వచ్చాయంటున్నారు.. ఆగస్టు 15కు ప్రారంభించాలని భావిస్తుండటంతో ఆ పనుల్ని మరింత వేగవంతం చేశారు అధికారులు.ఈ సీఆర్డీఏ శాశ్వత కార్యాలయం కోసం ఈ భవనాన్ని దాదాపు 3.62 ఎకరాల్లో ఏడు అంతస్తులతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యాలయం బిల్టప్ ఏరియా ఏకంగా 2.42 లక్షల చదరపు అడుగులు. ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు.. దీని ద్వారా అమరావతి నగరంలోని ట్రాఫిక్, భద్రత, పారిశుద్ధ్యం, వరదలు వంటి వాటిని రివ్యూ చేయొచ్చు. ఈ సీఆర్డీఏ శాశ్వత కార్యాలయ భవనం అందుబాటులోకి వస్తే.. ప్రస్తుతం విజయవాడలో ఉన్న సీఆర్డీఏ కార్యాలయాన్ని మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ)కు అప్పగించాలని నిర్ణయించారు. మొత్తం మీద అమరావతిలో తొలి శాశ్వత భవనం ప్రారంభించే దిశగా అడుగులు పడుతున్నాయి.

Related Posts