YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

24 లక్షల కోట్ల డిజిటల్ లావాదేవీలు

24 లక్షల కోట్ల డిజిటల్ లావాదేవీలు

న్యూఢిల్లీ, జూలై 21, 
ప్రపంచ ఆర్థిక శక్తిగా అమెరికాకు పేరు ఉంది. రెండవ స్థానంలో చైనా ఉంది. మూడో స్థానంలో జర్మనీ కొనసాగుతోంది.. నాలుగు స్థానంలో ఇండియా ఉంది. తొలి మూడు దేశాలకు సాధ్యం కానిది.. ఆ మూడు దేశాలు చేయలేనిది భారత్ చేసింది. చేయడం మాత్రమే కాదు సరి కొత్త చరిత్ర సృష్టించింది.. ఆ మూడు దేశాలు కలలో కూడా ఊహించని అద్భుతాన్ని చేసింది. డిజిటల్ లావాదేవీలలో దూసుకుపోతోంది. ఫైవ్ స్టార్ హోటల్ నుంచి మొదలు పెడితే కూరగాయల దుకాణం వరకు ప్రతి లావాదేవీ కూడా అంతర్జాలం లోనే జరిగిపోతుంది. అరుదుగా మాత్రమే నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. మనదేశంలో జూన్ నెలలో 24.3 లక్షల కోట్ల నగదు లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగాయి అంటే.. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వెల్లడించింది. గత ఏడది జూన్ నెలతో పోల్చి చూస్తే ఇది 32 శాతం అధికమని తెలుస్తోంది. “వ్యక్తిగత.. చిన్నచిన్న వ్యాపారులకు డిజిటల్ చెల్లింపు అనేది ఆర్థిక సాధనంగా మారింది. వారి వ్యాపారాలు డిజిటల్ విధానంలోనే సాగుతున్నాయి. ఇవన్నీ కూడా వారి ఆర్థికముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. చెల్లింపుల విధానం మారడం వల్ల వ్యాపారాలు కూడా ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారని” అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వెల్లడించింది.మనదేశంలో కోవిడ్ కంటే ముందు డిజిటల్ విధానంలో చెల్లింపులు ఒక స్థాయి వ్యక్తులకు మాత్రమే పరిమితమయ్యేవి. కానీ కోవిడ్ తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. డిజిటల్ చెల్లింపులు అనేవి అన్ని రంగాలకు విస్తరించాయి. కనీవినీ ఎరుగని రీతిలో చెల్లింపుల స్థాయి పెరిగిపోయింది. అందువల్లే ఈ స్థాయిలో లావాదేవీలు జరుగుతున్నాయి.. ప్రభుత్వం కూడా డిజిటల్ ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడానికి కృషి చేస్తున్న నేపథ్యంలో.. ఆర్దిక లావాదేవీలు మరింత పెరిగిపోతున్నాయి. అందువల్లే ప్రజలు చెల్లింపుల కోసం మరో మాటకు తావు లేకుండా యూపీఐ విధానాన్ని ఎంచుకుంటున్నారు. అయితే ఏడాది వ్యవధిలోనే 32 శాతం డిజిటల్ లావాదేవీలు పెరిగాయంటే.. భవిష్యత్ కాలంలో ఈ శాతం మరింత పెరుగుతుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.ఆర్థికంగా శక్తివంతమైన తొలి మూడు దేశాలలో ఆన్లైన్ లావాదేవీలు అంతంత మాత్రమే సాగుతున్నాయి. ఇప్పటికీ ఆ దేశాలలో కొంతమంది ప్రజలకు ఆన్లైన్ లావాదేవీల మీద అవగాహన లేదు. అవగాహన కల్పించే ప్రయత్నాలను అక్కడ ప్రభుత్వాలు చేయడం లేదు. అక్షరాస్యతపరంగా ఆ మూడు దేశాలు మనకంటే మెరుగ్గానే ఉన్నప్పటికీ ఆర్థిక అక్షరాస్యత విషయంలో మాత్రం వెనుకబడే ఉన్నాయి. ఇప్పటికీ ఆదేశాలలో చెల్లింపులు నగదు ద్వారానే సాగుతున్నాయి.. డిజిటల్ విధానంలో చెల్లింపుల వల్ల ఆర్థిక అక్షరాస్యత మీద అవగాహన ఉంటుంది. మోసాలకు ఆస్కారం ఉండదు. పారదర్శకతకు పెద్దపీట వేయడం వల్ల అవకతవకలకు అవకాశం ఉండదు.

Related Posts