
బెంగళూరు, జూలై 22,
ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఉత్పత్తికి తగ్గట్టుగా డిమాండ్ ఉంటేనే ఉపాధి లభిస్తుంది. ఉత్పత్తి అధికంగా ఉండే డిమాండ్ తక్కువగా ఉంటే ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. అలాగే డిమాండ్ అధికంగా ఉండి ఉత్పత్తి తక్కువగా ఉంటే అప్పుడు కూడా ఉపాధి అవకాశాలు ప్రభావితమవుతాయి.. అందువల్లే ఉత్పత్తికి, డిమాండుకు వ్యత్యాసం ఉండకూడదని.. ఇవి రెండు సమాంతరంగా సాగిపోవాలని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. దీనినే ఆర్థిక శాస్త్ర పరిభాషలో క్షిణోపాంత సూత్రం అని పిలుస్తుంటారు. నేటి కాలంలో ఈ సిద్ధాంతాన్ని అనేక దేశాలు పాటిస్తుంటాయి.. కాకపోతే గడిచిన కొంతకాలంగా అన్ని దేశాలు అడ్డగోలు విధానాలను పాటిస్తున్న నేపథ్యంలో డిమాండ్ సప్లై అనే సిద్ధాంతం తడబాటుకు గురవుతోంది. అందువల్లే అన్ని దేశాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి.ప్రస్తుతం ప్రపంచం కృత్రిమ మేధ వెంట పరుగులు తీస్తోంది. ఓపెన్ ఏఐ అనే కంపెనీ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అధిక్రమ క్రమంగా అన్ని రంగాలలో విస్తరించడం మొదలు పెట్టింది. ప్రస్తుతం ఓపెన్ ఏఐ, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ వంటి టాప్ ఐటి కంపెనీలు కృత్రిమ మేధ లో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. ఇవి ఎన్ని రకాలుగా ప్రయోగాలు చేసినప్పటికీ వినియోగం అనేది అంతిమంగా ఉండాలి. వినియోగం అనేది సరైన స్థాయిలో లేనప్పుడు కంపెనీలు తయారు చేసిన సాంకేతిక పరిజ్ఞానానికి అర్థం లేదు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించకపోతే మనుషులు వెనుకబడిపోతారు. ఈ విషయాన్ని గుర్తించి కేంద్రం సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టే దిశగా అడుగులు వేసింది. బహుశా ప్రపంచంలో ఈ స్థాయిలో ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలేదు. కృత్రిమ మేధ వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా 10 లక్షల మంది సిటిజన్లకు కృత్రిమ మేధ ఎలా వాడాలో ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.. ఈ ప్రకారం వచ్చే కొద్ది రోజుల్లో కృత్రిమ మేధ మార్కెట్లో భారత్ మొదటి స్థానాన్ని ఆక్రమించే అవకాశం ఉంది.కృత్రిమ మేధ లో భారతదేశానికి చెందిన కంపెనీలు కూడా పనిచేస్తున్నాయి.. దిగ్గజ సంస్థలు చేయలేని అద్భుతాలను చేసి చూపిస్తున్నాయి.. ఇప్పటికే వాట్సాప్ లో మన దేశం లో భాషలను మొత్తం అనుసంధానం చేసే విధంగా పుచ్ ఏఐని అర్జిత్ జైన్ అనే వ్యక్తి ప్రవేశపెట్టాడు.. అరవింద్ శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రీ ఫ్లెక్సిటీ అనే ఏఐ టెక్నాలజీని రూపొందించాడు. ఇవన్నీ కూడా దిగ్గజ సంస్థల టెక్నాలజీని మించిపోయాయి. ఒక రకంగా ఐ, గూగుల్ ప్లే స్టోర్ లో టాప్ స్థానంలో ఉన్నాయి. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ మీద ఇప్పుడే ప్రారంభ ప్రయోగాలు జరుగుతున్న నేపథ్యంలో.. ఇందులో భారత ఐటీ నిపుణులు అత్యంత కీలకంగా పనిచేస్తున్నారు. టాప్ కంపెనీలలో పనిచేస్తున్న నిపుణులు మొత్తం భారతదేశానికి చెందినవారే. వారంతా వేలకోట్ల ప్యాకేజీ ఆదుకుంటున్నారు.. అయితే త్వరలో భారత నిపుణులు కంపెనీలు ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదు. ఒకవేళ ఈ కంపెనీలు గనుక ఏర్పాటు అయితే.. కృత్రిమ మేధ లో సమూల మార్పులు వచ్చే అవకాశం ఉంది. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద వినియోగదారుల మార్కెట్ గా ఉంది కాబట్టి .. కృత్రిమ మేధకు జనాలను అలవాటు చేయిస్తే.. ఆ కంపెనీలకు తిరుగు ఉండదు.ఉదాహరణకు డిజిటల్ చెల్లింపులను తీసుకుంటే.. ప్రపంచంలో అత్యధికంగా యూపీఐ పేమెంట్లు చేస్తున్న దేశంగా భారత్ నిలిచింది.. జూన్ నెలలో 24.3 లక్షల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయి. దీన్ని బట్టి భారత్ డిజిటల్ చెల్లింపుల్లో ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ జనానికి కృత్రిమ మేధను వాడే అలవాటు చేయిస్తే భారత్ నెంబర్ వన్ స్థానంలో నిలుస్తుంది. దాంతోపాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి . దానికి అనుబంధంగా మరిన్ని కంపెనీలు వస్తాయి. అప్పుడు దేశ జిడిపి పెరుగుతుంది.. ఇతర వ్యాపారాలు కూడా ముమ్మరం అవుతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర మందిని అశ్విని వైష్ణవ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.