YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రేవంత్ సోత్కర్షపై చర్చోపచర్చలు

రేవంత్ సోత్కర్షపై చర్చోపచర్చలు

మహబూబ్ నగర్, జూలై 22, 
నాయకుడు ఎప్పుడూ కళ్లు నెత్తిమీద పెట్టుకోవద్దు.. ఎప్పుడూ కాళ్లు నేల మీద ఉండాలి. తాము ఎక్కడి నుంచి వచ్చాము.. ఎలా ఎదిగామన్నది మరవకూడదు. అసలు మూలాలు మరిచిపోవద్దు. అలా మరిచిపోతే మనం మంచి నేతగా నిలబడలేం. వైఎస్ఆర్ ఈ విషయంలో ఆదర్శుడు. ఆయన తన మూలాలు మరిచిపోకుండా సీఎం అయినా కూడా గతంలో తనకు సాయం చేసిన వారిని గుర్తు పెట్టుకున్నాడు. వారికి అండగా నిలిచాడు..కానీ తెలంగాణ సీఎం అయ్యాక రేవంత్ రెడ్డిలో వచ్చిన ఈ మార్పు విమర్శలకు దారితీస్తోంది. అవును.. ఎదోలా డక్కా మొక్కీలు తిని రేవంత్ సీఎం అయ్యాడు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి.. తర్వాత కేసీఆర్ ను ఎదురించి జైలు పాలు కావడం.. సానుభూతి రావడం.. ఇలా ఒక్కో మెట్టు ఎక్కాడు.అయితే సీఎం అయ్యాక తన వర్గానికే పదవులు ఇచ్చుకుంటున్నారని.. తాను చెప్పిన వారినే అందలమెక్కిస్తున్నాడన్న విమర్శలు ఉన్నాయి. సరే వ్యతిరేకత రాకుండా ఏ నేత అయినా ఇలానే చేస్తాడు.. అందులో తప్పు పట్డడానికి ఏం లేదు..కానీ తాను నియామకం చేసిన నేతల విషయంలోనే రేవంత్ రెడ్డి తీరు వివాదాస్పదమవుతోంది. అదే అందరికీ రేవంత్ పై నెగెటివిటీని వ్యాపింపచేస్తోంది. రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల వారికీ పదవులు ఇచ్చాడు మెచ్చుకోవాల్సిందే.. కానీ ఆ పదవులు ఇచ్చి వారిని నేనే ఇలా చేశానని.. వారి కులగోత్రాలను అందరి ముందు చెప్పడం మాత్రం ఏమాత్రం మంచి పద్ధతి కాదు..చేసిన సాయం మరొకరికి తెలియకుండా నడవాలంటారు. సాయం చేసిన మనం చెప్పొద్దు.. అందుకున్న వారు చెబితేనే దానికి విలువ.. తాజాగా రేవంత్ రెడ్డి ఇద్దరిని మంత్రులుగా చేశాడు. ఓ బీసీ సభలో అది తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ క్రెడిట్ నాదేనంటూ మాట్లాడిన మాటలు బూమరాంగ్ అయ్యాయి. వారిని తిట్టాడా? లేక పొగిడాడా? అన్న కోణంలో వైరల్ అయ్యాయి.. ‘‘బట్టలు ఉతికే జాతికి చెందిన వీర్లపల్లి శంకర్‌ని‌ ఎమ్మెల్యే చేశాను.. చేపలు పట్టుకునే వాకిటి శ్రీహరిని ఇవాళ మంత్రిని చేశాను’’ అన్న డైలాగులు విమర్శల పాలయ్యాయి..ఎంత చేసినా ఆ క్రెడిట్ ను చెప్పుకోవడానికి ఆ నేతలను అవమానించేలా మాట్లాడడంపైనే విమర్శలు వస్తున్నాయి. చేసింది చెప్పుకోవడం గొప్ప కాదు.. పదిమంది చెప్పుకునేలా చేయడం గొప్ప. ఆ విషయాన్ని రేవంత్ గ్రహిస్తే మేలు అని విశ్లేషఖులు అభిప్రాయపడుతున్నారు.
బట్టలు ఉతికే జాతికి చెందిన వీర్లపల్లి శంకర్‌ని‌ ఎమ్మెల్యే చేశాను
చేపలు పట్టుకునే వాకిటి శ్రీహరిని ఇవాళ మంత్రిని చేశాను – సీఎం రేవంత్ రెడ్డి

Related Posts