YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆ ఇద్దరే...

ఆ ఇద్దరే...

హైదరాబాద్, జూలై 22,
తెలంగాణలో అపోజిషన్‌ బీఆర్ఎస్..అధికార కాంగ్రెస్‌తో ఢీ అంటే ఢీ అంటోంది. పార్టీ మీద, అతినేత మీద వస్తున్న విమర్శలు, ఆరోపణలను ఎదుర్కోవడంలో అయినా..ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రశ్నించడంలో అయినా..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు ముందుంటున్నారు. అయితే పదేళ్లు పవర్‌లో ఉన్నప్పుడు అధికారం అనుభవించిన చాలా మంది బీఆర్ఎస్ ముఖ్య నేతలెవరు తమంతట తాముగా ఏ కార్యక్రమం చేయడం లేదట.పార్టీ నేతలకు, క్యాడర్‌కు ఏ ఇబ్బందులు వచ్చినా, అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి వేధింపులు ఎదురైనా కేటీఆర్, హరీశ్‌రావు తప్ప మిగతా ముఖ్య నేతలు పెద్దగా స్పందించడం లేదట. తమ తమ జిల్లాల్లో జరుగుతున్న సంఘటనలపై కూడా పైనుంచి ఆదేశాలు వచ్చే వరకు మనకెందుకులే అన్న ధోరణితో ఉంటున్నారట బీఆర్ఎస్ కీలక లీడర్లు.మల్కాజ్‌గిరిలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వివాదం చెలరేగింది. బోనాల పండగ చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ రగడ కాస్త ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ సునీత భర్త రాము యాదవ్‌పై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దాడి చేశారని అంటున్నారు. తమ పార్టీ నేతపై దాడి జరిగిందన్న విషయం తెలుకున్న వెంటనే ఖమ్మం పర్యటనలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా మల్కాజ్‌గిరిలోని కార్పొరేటల్ సునీత ఇంటికి వెళ్లి ఆమె భర్త రాము యాదవ్‌ను పరామర్శించారు.పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే తమ పార్టీ నేతపై కాంగ్రెస్ లీడర్లు దాడి చేశారన్న విషయం తెలిసినా హైదరాబాద్‌లోని పార్టీ ముఖ్యనేతలు మందు సైలెంల్‌గా ఉండిపోయారట. కనీసం ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదట. కానీ కేటీఆర్ వెళ్లి వాళ్లను పరామర్శించి వచ్చాక అప్పుడు హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలు మేల్కొన్నారట. అది కూడా కేటీఆర్ చెబితే కానీ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలు కదలలేదని తెలుస్తోంది. మన పార్టీ నేతలపై దాడి జరిగితే ఎందుకు స్పందించలేదని కేటీఆర్ వారిని ప్రశ్నించినట్లు తెలంగాణ భవన్ వర్గాల టాక్.అందులోనూ బీసీ వర్గం నేతపై దాడి జరిగితే కనీసం పార్టీలోని ఆ సామాజికవర్గం నేతలు కూడా స్పందించరా అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కేటీఆర్ చెప్పిన తర్వాత మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ తదితరులు అప్పుడు మల్కాజ్‌గిరికి వెళ్లి దాడిలో గాయపడ్డ కార్పొరేటర్ సునీత భర్త రాము యాదవ్‌ను పరామర్శించారని తెలుస్తోంది. ఇదే పని ముందు చేసి ఉంటే బాగుండేదన్న చర్చ పార్టీలో జరుగుతోంది.ఈ ఒక్క ఇష్యూలోనే కాదు చాలా అంశాల్లో, చాలా సందర్భాల్లో కేటీఆర్, హరీశ్‌రావులు మినహా మిగతా ముఖ్యనేతలంతా తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న చర్చ బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై వేధింపులు ఎక్కువయ్యాయని వాపోతోంది క్యాడర్. పార్టీ నేతలపై దాడులు, అక్రమ కేసులు పెట్టినా మిగతా నేతలు పెద్దగా స్పందించడం లేదని అంటున్నారు. అప్పుడు కూడా కేటీఆర్ లేదంటే హరీశ్‌రావులు చెబితే తప్ప ముఖ్య నేతలెవ్వరు రెస్పాండ్ కావడం లేదని చెబుతున్నారు.ఇలా ప్రతిసారి పైనుంచి ఆదేశాలు వస్తేనో.. అధిష్టానం చెబితేనో తప్ప మిగతా సందర్భాల్లో తమకెందుకులే అని పట్టీపట్టనట్లు ఉంటున్నారట బీఆర్ఎస్ నేతలు. అధికార కాంగ్రెస్, బీజేపీ నుంచి పార్టీ అధినేత కేసీఆర్ లేదంటే మిగతా వారిపై విమర్శలు, ఆరోపణలు చేసిన సందర్భాల్లోను పైనుంచి చెబితే ముఖ్యనేతలు రియాక్ట్ కావడం లేదని లేదని తెలుస్తోంది. ఇలా అన్నీ కేటీఆర్, హరీశ్‌రావులే చూసుకోవాలంటే కష్టమేనని, అన్నింటికీ వాళ్లే స్పందించాలంటే అయ్యే పని కాదని పార్టీ ముఖ్య నేతల్లో మార్పు రావాలన్న టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

Related Posts