YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హెచ్ సీఏలో ఏం జరుగుతోంది

హెచ్ సీఏలో ఏం జరుగుతోంది

హైదరాబాద్, జూలై 22, 
కొన్ని రోజులుగా హైదరా బాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారం ప్రధానంగా చర్చల్లో నిలుస్తోంది. హెచ్‌సీఏ అవినీతి, అక్రమాలపై ఇప్పటికే సీఐడీ విచారణ చేస్తోంది. ఈ క్రమంలో హెచ్‌సీఏ అక్రమాలు తవ్వుతున్న కొద్దీ ఒక్కొక్క టిగా బయటపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధి లక్ష్యాన్ని నిర్వీర్యం చేస్తూ జిల్లాల్లో, గ్రామీణ క్రికెట్‌పై ఆసక్తి ఉన్న క్రీడాకారుల భవిష్యత్‌ను హెచ్‌సీఏ ఫణంగా పెట్టింది.తద్వారా కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడింది. ఎన్నో ఏళ్లుగా జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి నిర్లక్ష్యానికి గురవుతున్నప్పటికీ హెచ్‌సీఏ అధ్యక్షు డిగా జగన్‌మోహన్‌రావు ఎన్నికైన తర్వా త ఇది మరింత దిగజారిపోయింది. అధికారిక లెక్కల్లో నిధులు కేటాయిస్తున్నప్పటికీ నిధుల విని యోగం మాత్రం మచ్చుకు కూడా కనిపించడంలేదు.హెచ్‌సీఏ జిల్లాల్లోని క్లబ్‌లకు పేరుకే నిధులను ప్రకటించి చేతు లు దులుపుకుంటోంది. ప్రతిభ ఉన్న క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేయాల్సిన హెచ్‌సీఏ తన బాధ్యతను విస్మరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి ఉన్న పిల్లల్లో క్రికెట్‌లో నైపుణ్యం పెంపొందించకుండా అవినీతి, అక్రమాలకు కేంద్రంగా నిలిచింది. ప్రతీ సంవత్సరం జిల్లా క్లబ్‌లు నిర్వహించే సమ్మర్ క్యాంపులకు హెచ్‌సీఏ నిధులు కేటాయిస్తుంది. 2024 ఏప్రిల్‌లో నిర్వహించిన సమ్మర్ క్యాంపుల కోసం గానూ ఒక్కో జిల్లా క్లబ్‌కు రూ.15లక్షలు మంజూరు చేసింది. ఆయా జిల్లాల్లోని 28 సెంటర్లలో 30 రోజుల పాటు సమ్మర్ క్యాంపు నిర్వహిస్తారు.వరంగల్ జిల్లాలో 6, మహబూబ్‌నగర్‌లో 4, మెదక్‌లో 3, నిజామాబాద్‌లో 3, కరీంనగర్‌లో 3, ఖమ్మంలో 3, ఆదిలాబాద్‌లో 3, హైదరాబాద్‌లో 5 సెంటర్లలో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఒక్కో లూ క్యాంపులో 80 నుంచి 100 మంది పిల్లలకు శిక్షణ ఇస్తారు. దీనిలో బాలలకు సంబంధించి అండర్ అండర్ అండర్‌ూ బాలికలకు సంబంధించి అండర్ అండర్  శిక్షణ నిర్వహిస్తారు. అయితే ప్రణాళికాపరంగా అంతా బాగానే ఉన్నా..దీన్ని ఆచరించడంలో మాత్రం హెచ్‌సీఏ తీవ్ర నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తోంది.కేవలం పేరుకే జిల్లాల్లో నిర్వహించే సమ్మర్ క్యాంపుల కోసం నిధులు కేటాయిస్తుంది. కానీ ఖర్చు చేసి పిల్లలకు శిక్షణ మాత్రం ఇవ్వదు. సమ్మర్ క్యాంపుల పేరుతో తూతూమంత్రంలా శిక్షణను నిర్వహించి చేతులు దులుపుకుంటోంది. జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి చేయకపోగా సమ్మర్ క్యాంపులు, టోర్నమెంట్ల పేరిట ప్రతి ఏటా కోట్లాది రూపాయల అవినీతికి హెచ్‌సీఏ పాల్పడుతున్నదని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపిస్తున్నది. వాస్తవానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేవలం హైదరాబాద్ జిల్లాకే పరిమితం కావాలి. కానీ తెలంగాణలోని అన్ని జిల్లాల క్లబ్‌లు హెచ్‌సీఏ ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. అయితే హెచ్‌సీఏ పరిధిలో మొత్తం 216 క్లబ్‌లు ఉన్నాయి. వాటిలో కేవలం 8 మాత్రమే జిల్లాల క్లబ్‌లు పనిచేస్తున్నాయి.ఈ గణాంకాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధిపై హెచ్‌సీఏ నిర్లక్ష్యం, అన్ని జిల్లాల క్లబ్బులపై ఆధిపత్య ధోరణి స్పష్టమవుతున్నది. దీనికి తోడు మొత్తం 216 క్లబ్బుల్లో 57 క్లబ్బులు సస్పెండ్ అయ్యాయి. సస్పెండ్ అయిన క్లబ్బులను కొనసాగించడం, ఫేక్ క్లబ్‌ల నిర్వహణలో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు కీలకంగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి.ఇదిలా ఉంటే ఆయా జిల్లాలకు ఉన్న ఒక్క క్లబ్బుల నిర్వహణలోనూ అవినీతి, అక్రమాలకు హెచ్‌సీఏ తెర లేపింది. పేరుకే జిల్లాల క్లబ్బులు, వాటిలో ఉండే సభ్యులందరూ హైదరాబాద్‌కు చెందిన వారే కావడం గమనార్హం. జిల్లా క్లబ్బుల్లో స్థానికులకు చోటు లేకుండా హెచ్‌సీఏకు సంబంధించిన వ్యక్తులు కొనసాగుతున్నారని టీసీఏ ఆరోపిస్తుంది. దీంతో జిల్లాల క్లబ్బులకు కేటాయించిన నిధులు దుర్వినియోగం కావడానికి మరింత అవకాశం ఉంది.సభ్యులకే కాదు జిల్లా క్లబ్‌ల్లోని ఆటగాళ్లు కూడా హైదరాబాద్‌కు చెందిన వారే ఉంటున్నారనే ఆరోపణ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హెచ్‌సీఏ పరిధిలోని ఆటగాళ్లనే జిల్లా క్రికెట్ క్లబ్ తరఫున బరిలో దింపుతున్నారు. ఈక్రమంలో జిల్లా క్లబ్‌ల్లో ఆడేందుకు క్రీడాకారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని టీసీఏ ప్రధానంగా ఆరోపిస్తోంది.దీంతో గ్రామీణ స్థాయి క్రీడాకారులకు అవకాశాలు లేకపోవడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధి కుంటుపడుతోంది. ఇప్పటికైనా హెచ్‌సీఏ ఆధిపత్యాన్ని తగ్గించడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని క్లబ్‌లను ఏర్పాటు చేసి ఆసక్తి గల అభ్యర్థులకు సరైన శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.

Related Posts