
తిరుపతి
మాజీ మంత్రి ఆర్కే రోజాపై శాప్ ఛైర్మన్ రవినాయుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. క్రీడా శాఖ మంత్రిగా రోజా చేసిన అవినీతి బయటపడుతోంది. రోజా అవినీతిపై విచారణ జరుగుతోంది. ఆడుదాం - ఆంధ్రా పేరుతో కోట్ల రూపాయలు తినేసిన రోజా జైలుకెళ్ళడం ఖాయం. ఆగష్టు 10వతేదీలోగా రోజా జైలుకెళ్ళడం ఖాయం. రోజా అరెస్ట్ కు వారెంట్ సిద్థమవుతోంది. రోజులు లెక్కబెట్టుకో రోజా అని హెచ్చరించారు. క్రీడా శాఖ మంత్రిగా ఒక్క స్టేడియం అయినా రోజా నిర్మించారా..? రోజా నగరికి టూరిస్ట్. నిత్యం తమిళనాడులోనే ఉంటున్నారు. ఎమ్మెల్యే గాలిభానుప్రకాష్ పై రోజా వ్యాఖ్యలు క్షమించరానిది. రోజమ్మా నీకు దమ్ముంటే గాలిభాను సవాల్ ను స్వీకరించాలి. రోజా వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి. చంద్రబాబును ఏకవచనంతో రోజా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తున్నాం. సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళుతున్నాం. పరిశ్రమలు వస్తున్నాయి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావడాన్ని వైసిపి నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు . గత మూడునెలలుగా జగన్ వికృత చేష్టలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. వైసిపి నేతలు రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.