YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విద్య-ఉపాధి

జనరల్ నాలెడ్జి ...

 జనరల్ నాలెడ్జి ...

ప్రశ్న -  ప్రపంచంలో మొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ 
జవాబు -  లండన్ (1863) 
    
ప్రశ్న  -  ప్రపంచంలో తొలి గ్రంథం  
జవాబు -  రుగ్వేదం 
    
ప్రశ్న  -  తొలిసారిగా మన దేశంలో బంగారు నాణేలు ప్రవేశపెట్టినవారు  
జవాబు  -  ఇండో - గ్రీకులు 
    
ప్రశ్న  -  దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం  
జవాబు  -  ఆంధ్రప్రదేశ్ (1956) 
    
ప్రశ్న  -  భారత్‌లో మొదటి మహిళా కళాశాల  
జవాబు  -  బెతూన్ కళాశాల  కలకత్తా (1879) 
    
ప్రశ్న -  ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం  
జవాబు  -  జపాన్ (టోక్యో  1964) 
    
ప్రశ్న  -  మానవుడు తొలిసారిగా ఉపయోగించిన లోహం  
జవాబు -  రాగి 
    
ప్రశ్న  -  భారత్‌లో తొలి నాగరికత  
జవాబు  -  సింధు 
    
ప్రశ్న  -  తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం  
జవాబు  -  జనతా ప్రభుత్వం (1977 - 79) 
    
ప్రశ్న  -  ప్రపంచంలో మొదటి భూగర్భ ఎలక్ట్రిక్ రైల్వే వ్యవస్థ  
జవాబు -  లండన్ (1890) 
    
ప్రశ్న  -  భారత్‌లో మన మొదటి న్యూక్లియర్ రియాక్టర్  
జవాబు -  అప్సర (1956) 
    
ప్రశ్న  -  భారత్‌లో తొలి పత్రిక  
జవాబు  -  బెంగాల్ గెజిట్ (1780) 
    
ప్రశ్న  -  ఆసియాలో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం  
జవాబు  -  ముంబయి 
    
ప్రశ్న  -  దేశంలో తొలి చమురు బావి  
జవాబు  -  దిగ్బోయ్ (అస్సాం  1890) 
    
ప్రశ్న -  మానవుడు మొదటిసారిగా మచ్చిక చేసుకున్న జంతువు  
జవాబు  -  కుక్క 
    
ప్రశ్న  -  దేశంలో 100 శాతం కంప్యూటర్ అక్షరాస్యత సాధించిన తొలి గ్రామం  
జవాబు  -  చామ్రవట్టం (కేరళ) 
    
ప్రశ్న -  భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగిన స్థలం  
జవాబుr -  ముంబయి (1885) 
    
ప్రశ్న  -  మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం  
జవాబు  -  న్యూజిలాండ్ (1893) 
    
ప్రశ్న  -  భారత్‌లో తొలి పూర్తి బ్యాంకింగ్ జిల్లా  
జవాబు -  పాలక్కడ్ (కేరళ) 
    
ప్రశ్న -  భారతదేశంలో సౌరశక్తితో విద్యుదీకరించిన తొలి గ్రామం  
జవాబు  -  చోగ్లామ్‌సార్ (జమ్ము  కాశ్మీర్) 
    
ప్రశ్న -  తొలి ఇ-నెట్‌వర్క్ జిల్లా  
జవాబు -  మలప్పురం (కేరళ) 
    
ప్రశ్న -  భారత్‌పై దండెత్తిన తొలి యూరోపియన్  
జవాబు  -  అలెగ్జాండర్ (క్రీ.పూ. 326) 
    
ప్రశ్న  -  భారత్‌లో పూర్తిగా విద్యుదీకరించిన తొలి నగరం  
జవాబు  -  బెంగళూరు (1906) 
    
ప్రశ్న -  భారత్‌లో వైర్‌లెస్ కనెక్టివిటీ ఉన్న మొదటి నగరం  
జవాబు  -  మైసూర్ (కర్ణాటక) 
    
ప్రశ్న  -  మొదటి యాంటీ బయోటిక్ డ్రగ్  
జవాబు -  పెన్సిలిన్ 
    
ప్రశ్న -  భారత్‌లో మొదటి అణు పరీక్ష  
జవాబు  -  పోఖ్రాన్ (రాజస్థాన్ - 1974) 
    
ప్రశ్న  -  భారత్ ప్రయోగించిన మొదటి ఉపగ్రహం  
జవాబు  -  ఆర్యభట్ట (1975) 
    
ప్రశ్న -  భారత్‌లో తొలి సైన్స్ నగరం  
జవాబు  -  కలకత్తా 
    
ప్రశ్న  -  కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తొలి కృత్రిమ ఉపగ్రహం  
జవాబు  -  స్పుత్నిక్ (రష్యా - 1957) 
    
ప్రశ్న -  ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళ  
జవాబు  -  రజియా సుల్తానా 
    
ప్రశ్న  -  ఇండియాలోమొదటి రైల్వే లైను  
జవాబు  -  ముంబయి నుంచి థానే (1853) 
    
Question -  ఇండియాలో మొదటి టెలిగ్రాఫ్ లైను  
Answer -  కలకత్తా  డైమండ్ హార్బర్‌ల మధ్య (1851) 
    
ప్రశ్న  -  భారత్ మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం  
జవాబు -  ఆపిల్ (1981) 
    
ప్రశ్న  -  భారత్ ప్రయోగించిన తొలి మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్  
జవాబు  -  PSLVC - 2 
    
ప్రశ్న  -  భారత్‌లో తొలి తపాలా కార్యాలయం ఉన్న నగరం  
జవాబు  -  కలకత్తా (1727) 
    
ప్రశ్న -  మనదేశంలో రేడియో ప్రసారాలు తొలిసారిగా ప్రసారమైన ప్రాంతం  
జవాబు  -  ముంబయి  కలకత్తాల మధ్య (1927) 
    
ప్రశ్న -  ఇండియాలో తొలి మూగ (మూకి) సినిమా  
జవాబు  -  రాజా హరిశ్చంద్ర (1913) 
    
ప్రశ్న -  ప్రపంచంలో మొదటి టాకీ సినిమా  
జవాబు  -  ది జాజ్ సింగర్ (1927) 
    
ప్రశ్న  -  భారత్‌లో మొదటి టాకీ సినిమా  
జవాబు -  ఆలం ఆరా (1931) 
ప్రశ్న  -  పూర్తినిడివి ఉన్న మొదటి కార్టూన్ చిత్రం  
జవాబు  -  స్నోవైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్ 
    
ప్రశ్న  -  భారతదేశంలో మొదటి ఉక్కు కర్మాగారం  
జవాబు  -  టాటా ఐరన్  స్టీల్ కంపెనీ (1907) 
    
ప్రశ్న  -  విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం  
జవాబు  -  మదర్ ఇండియా 
    
ప్రశ్న  -  భారతదేశ మొదటి యోగా శాస్త్రవేత్త  
జవాబు  -  పతంజలి 
    
ప్రశ్న  -  ప్రపంచంలో మొదటిసారిగా నిర్వహించిన అందాల పోటీలు  
జవాబు  -  కార్నిత్ (గ్రీకు క్రీ.పూ. 700) 
    
ప్రశ్న  -  భారత్ తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్  
జవాబు -  ఇంగ్లండ్‌తో (1932) 
    
ప్రశ్న  -  భారత్ తొలి ఎలక్ట్రిక్ రైలు  
జవాబు  -  ముంబయి నుంచి వి.టి. కుర్లా వరకు  (1925) 
    
ప్రశ్న  -  మొదటి ఆటంబాంబు  
జవాబు -  లిటిల్ బాయ్ (1945) 
    
ప్రశ్న  -  ప్రపంచం

లో మొదటిసారిగా కుటుంబ నియంత్రణ అమలు చేసిన దేశం  
జవాబు  -  భారతదేశం 
    
ప్రశ్న  -  భారత దేశాన్ని సందర్శించిన తొలి చైనీస్ యాత్రికుడు  
జవాబు -  పాహియాన్ 
    
ప్రశ్న  -  భారత దేశంలో శాసనాలు వేయించిన తొలి చక్రవర్తి  
జవాబు  -  అశోకుడు 
    
ప్రశ్న  -  దేశంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం  
జవాబు -  పంజాబ్ 
    
ప్రశ్న  -  భార‌త‌ దేశ మొదటి రాష్ట్రపతి  
జవాబు  -  డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ (1950 - 1962) 
    
ప్రశ్న  -  భారతదేశ తొలి అణు పరిశోధనా కేంద్రం  
జవాబు  -  బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బీఏఆర్‌సీ) 
    
ప్రశ్న  -  భారతదేశ తొలి ప్రయోగాత్మక భూపరిశీలన ఉపగ్రహం  
జవాబు  -  భాస్కర - 1 
    
ప్రశ్న  -  భారతదేశ తొలి ఖండాంతర క్షిపణి  
జవాబు  -  సూర్య 
    
ప్రశ్న  -  గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ ఉన్న తొలి క్షిపణి  
జవాబు  -  అగ్ని-2 
    
ప్రశ్న  -  స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి క్షిపణి  
జవాబు  -  పృథ్వీ 
    
ప్రశ్న  -  చంద్రుడిపై పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన తొలి ఉపగ్రహం  
జవాబు  -  చంద్రయాన్ - 1 
    
ప్రశ్న  -  మన దేశ తొలి ప్రయోగాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం  
జవాబు  -  భాస్కర - 1 
    
ప్రశ్న  -  స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి అణు జలాంతర్గామి  
జవాబు -  అరిహంత్ (2009) 
    
ప్రశ్న  -  భారత దేశ తొలి అణు సబ్‌మెరైన్  
జవాబు -  ఐఎన్ఎస్ చక్ర 
    
ప్రశ్న  -  దేశీయ పరిజ్ఞానంతో తయారైన తొలి సబ్‌మెరైన్  
జవాబు  -  ఐఎన్ఎస్ షల్కి 
    
ప్రశ్న -  స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన దేశ తొలి క్షిపణి నౌక  
జవాబు  -  ఐఎన్ఎస్ విభూతి 
    
ప్రశ్న  -  మన దేశ తొలి గూఢచార నౌక  
జవాబు  -  ఐఎన్ఎస్ శివాలిక్ 
    
ప్రశ్న -  భారత నావికాదళంలో తొలి యుద్ధ నౌక  
జవాబు  -  ఐఎన్ఎస్ సావిత్రి 
    
ప్రశ్న  -  భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి పైలట్ రహిత యుద్ధ విమానం  
జవాబు  -  నిశాంత్ 
    
ప్రశ్న  -  తొలి టెస్ట్‌ట్యూబ్ బేబి  
జవాబు  -  లూయిస్ బ్రౌన్ (1978  ఇంగ్లండ్) 
    
ప్రశ్న  -  ఓడపై ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి Answer  
జవాబు  -  ఫెర్డినాండ్ మాజిలాన్ (స్పెయిన్) 
    
ప్రశ్న  -  ఐక్యరాజ్యసమితి తొలి సెక్రెటరీ జనరల్  
జవాబు  -  ట్రిగ్వేలీ (నార్వే  1946 - 53) 
    
ప్రశ్న  -  ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తులు  
జవాబు  -  టెన్సింగ్ నార్కే (భారత్)  ఎడ్మండ్ హిల్లరీ (న్యూజిలాండ్) 1955 
    
ప్రశ్న  -  ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ  
జవాబు -  జుంకోతాబి (జపాన్  1975) 
    
ప్రశ్న  -  తొలి కేంద్ర‌ ఆర్థికమంత్రి  
జవాబు  -  ఆర్.కె. షణ్ముగం చెట్టి 
    
ప్రశ్న  -  తొలి కేంద్ర‌ వ్యవసాయ శాఖామంత్రి  
జవాబు  -  బాబూ రాజేంద్రప్రసాద్ 
    
ప్రశ్న  -  తొలి కేంద్ర‌ హోంశాఖామంత్రి  
జవాబు  -  సర్దార్ వల్లభాయ్ పటేల్ 
    
ప్రశ్న  -  తొలి కేంద్ర‌ కార్మిక శాఖామంత్రి  
జవాబు -  బాబూ జగ్‌జ్జీవన్ రామ్ 
    
ప్రశ్న  -  ఎర్రకోటపై ఎక్కువసార్లు జాతీయ జెండాను ఎగరవేసిన తొలి ప్రధాని  
జవాబు  -  జవహర్‌లాల్ నెహ్రూ (17 సార్లు) 
    
ప్రశ్న  -  మొదటి అటార్నీ జనరల్  
జవాబు  -  ఎం.సి. సెతల్‌వాడ్ 
    
ప్రశ్న  -  పదవిలో ఉండగా మరణించిన ఏకైక స్పీకర్  
జవాబు r -  జి.ఎం.సి. బాలయోగి 
    
ప్రశ్న  -  భారత్‌లో హత్యకు గురైన ఏకైక వైశ్రాయి  
జవాబు  -  లార్డ్ మేయో (1872) 
    
ప్రశ్న  -  ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడు  
జవాబు  -  అభినవ్ బింద్రా (2008  బీజింగ్  షూటింగ్) 
    
ప్రశ్న  -  అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన తొలి మహిళ  
జవాబు  -  కల్పనా చావ్లా 
    
ప్రశ్న  -  అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు  
జవాబు -  రాకేష్ శర్మ (1984) 
    
ప్రశ్న  -  భారత్‌ను పాలించిన తొలి మహిళ  
జవాబు  -  రజియా సుల్తానా (1236 - 1240) 
    
ప్రశ్న -  స్వతంత్ర భారత పోస్టల్ స్టాంపుపై దర్శన మిచ్చిన తొలి Answer  
జవాబు  -  మహాత్మా గాంధీ (1948) 
    
ప్రశ్న  -  తొలి మహిళా రాయబారి  
జవాబు  -  విజయలక్ష్మి పండిట్ (మాజీ సోవియట్‌కు  1947 - 49) 
    
ప్రశ్న  -  ఐక్యరాజ్యసమితి సివిల్ పోలీస్‌కు సలహాదారుడిగా నియమితులైన తొలి భారతీయ మహిళ  
జవాబు  -  కిరణ్‌బేడి 
    
ప్రశ్న -  తొలి మహిళా ఐ.పి.ఎస్. అధికారి  
జవాబు  -  కిరణ్‌బేడి (1972) 
    
ప్రశ్న  -  మొదటి దళిత ముఖ్యమంత్రి  
జవాబు -  దామోదరం సంజీవయ్య (ఆంధ్రప్రదేశ్  1960 - 62) 
    
ప్రశ్న  -  మొదటి మహిళా ముఖ్యమంత్రి  
జవాబు  -  సుచేతా కృపాలానీ (ఉత్తర్ ప్రదేశ్  1963 - 67) 
    
ప్రశ్న  -  మొదటి మహిళా గవర్నర్  
జవాబు  -  సరోజినీ నాయుడు (ఉత్తర్  ప్రదేశ్  1947 - 49) 
    
ప్రశ్న  -  భారత ఎన్నికల తొలి మహిళా కమిషనర్  
జవాబు  -  వి.ఎస్. రమాదేవి 
    
Question -  భారత తొలి ఎన్నికల కమిషనర్  
జవాబు  -  సుకుమార్ సేన్ 
    
ప్రశ్న  -  లోక్‌సభకుతొలి మహిళా స్పీకర్  
జవాబు  -  మీరాకుమార్‌ 
    
    
ప్రశ్న -  లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేసిన తొలి ఆంధ్రుడు  
జవాబు -  నీలం సంజీవరెడ్డి 
    
ప్రశ్న-  లోక్‌సభ తొలి స్పీకర్  
జవాబు  -  గణేష్ వాసుదేవ్ మౌలాంకర్ 
    
    
ప్రశ్న -  ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించిన మొదటి ప్రధాని  
జవాబు  -  అటల్ బిహారీ వాజ్‌పేయ్ 
    
    
ప్రశ్న -  పార్లమెంటులో సభ్యత్వం లేకుండా ప్రధాని అయిన తొలి Answer  
జవాబు  -  పి.వి. నరసింహారావు 
    
    
ప్రశ్న -  ప్రధాని పదవికి రాజీనామా చేసిన మొదటి Answer  
జవాబు -  మొరార్జీ దేశాయ్ 
    
    
ప్రశ్న -  మొదటి కాంగ్రెసేతర ప్రధాని  
జవాబు  -  మొరార్జీ దేశాయ్ 
    
    
ప్రశ్న-  హత్యకు గురైన మొదటి ప్రధాని  
జవాబు  -  ఇందిరాగాంధీ 
    
    
ప్రశ్న -  అత్యధిక రాజ్యాంగ సవరణలు చేసిన మొదటి ప్రధాని  
జవాబు -  ఇందిరాగాంధీ 
    
    
ప్రశ్న -  మొదటి మహిళా ప్రధాని  
జవాబు -  ఇందిరాగాంధీ 
    
    
ప్రశ్న -  విదేశాల్లో మరణించిన మొదటి ప్రధాని  
జవాబు -  లాల్‌బహదూర్‌శాస్త్రి 
    
    
ప్రశ్న -  పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి  
జవాబు  -  డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1969) 
    
    
ప్రశ్న -  భారతరత్న పొందిన తొలి మహిళ  
జవాబు  -  ఇందిరాగాంధీ (1971) 
    
    
ప్రశ్న -  భారతదేశ చివరి గవర్నర్ జనరల్  మొదటి వైస్రాయ్  
జవాబు  -  లార్డ్ కానింగ్ (1856 - 62) 
    
    
ప్రశ్న -  స్వాతంత్య్రం రాకముందు భారత దేశ మొదటి గవర్నర్ జనరల్  
జవాబు  -  విలియం బెంటింగ్ (1828 - 35) 
    
    
ప్రశ్న -  స్వతంత్ర భారత మొదటి  చివరి గవర్నర్ జనరల్  
జవాబు  -  మౌంట్ బాటన్ (1947 - 48) 
    
    
ప్రశ్న -  స్వతంత్ర భారత మొదటి  చివరి భారతీయ గవర్నర్ జనరల్  
జవాబు  -  సి. రాజగోపాలాచారి 
    
    
ప్రశ్న -  భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు  
జవాబు  -  ఉమేష్ చంద్ర బెనర్జి (1885 - బొంబయి) 
    
    
ప్రశ్న -  అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళ  
జవాబు  -  వాలెంటీనా తెరిష్కోవా 
    
    
ప్రశ్న -  అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మానవుడు  
జవాబు  -  యూరీ గగారిన్ (సోవియట్ యూనియన 1961).

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Related Posts