YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

హెచ్‌-1బీ వీసా జారీ పై నిబంధలను మరింత సంక్లిష్టం

హెచ్‌-1బీ వీసా జారీ పై నిబంధలను మరింత సంక్లిష్టం
హెచ్‌-1బీ వీసా జారీ పై ట్రంప్‌ ప్రభుత్వం ఈ నిబంధలను మరింత సంక్లిష్టం చేసింది. దీనితో అమెరికా వెళ్లే  నిపుణులు మరింత గడ్డుకాలాన్ని ఎదుర్కోనున్నారు. ఈ నిబంధనల ప్రకారం.. హెచ్‌-1బీ వీసా గడువు తీరిపోయిన వారు ఇక అమెరికాలో ఎక్కువ రోజులు కొనసాగలేరు. వారిని దేశ బహిష్కరణ లేదా పునరాగమనంపై నిషేధం విధిస్తారు.హెచ్‌-1బీ వీసాపై అమెరికాకి వెళ్లిన నిపుణులు.. వీసా గడువు పెంచుకోవడానికి పెట్టుకున్న దరఖాస్తు లేదా అభ్యర్థనలు తిరస్కరణకు గురైతే సదరు వ్యక్తులు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. వీసా గడువు తీరిన తర్వాత సగటున 240రోజులు మాత్రమే అక్కడ ఉండటానికి అనుమతి ఉంది. ఆలోపు వీసా గడువు పెంపు దరఖాస్తు తిరస్కరణకు గురైతే వెంటనే దేశం వదిలి వెళ్లిపోవాలి. అలాకాకుండా అనధికారికంగా అక్కడే నివసించే వాళ్లకి యూఎస్‌ సిటిజన్‌షిప్ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీస్‌(యూఎస్‌సీఐఎస్‌) ‘నోటీస్‌ టు అప్పియర్‌(ఎన్‌టీఏ) జారీ చేస్తుంది. ఇది జారీ చేసిన అనంతరం సదరు ఉద్యోగులు ఉద్యోగంలో కొనసాగడానికి వీలుండదు. దీనిపై విచారణ జరిగే వరకు మాత్రమే అమెరికాలో ఉండటానికి అవకాశం ఉంటుంది. దీని ప్రకారం వీసా గడువు తీరిన వ్యక్తి ఇమ్మిగ్రేషన్‌ న్యాయమూర్తి ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో సదరు వ్యక్తి అమెరికాలో లేనట్లయితే అతనిపై గరిష్ఠంగా ఐదేళ్ల పాటు అమెరికాలోకి రాకుండా నిషేధం విధిస్తారు. వీసా గడువు పెంపు దరఖాస్తు తిరస్కరణకు గురయ్యాక కూడా ఏడాది పాటు అమెరికాలో అనధికారికంగా నివసిస్తే వారిపై పదేళ్లపాటు నిషేధం అమలు చేస్తారు.వీసా గడువు పెంచుకోవడానికి లేదా, తమ స్టేటస్‌ మార్పుకోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురయితే సదరు వ్యక్తులు వెంటనే భారత్‌కు తిరిగి వచ్చేయాల్సి ఉంటుంది. వీళ్లకి ఎన్‌టీఏ నోటీసులు జారీ చేయరు. సుమారు 7లక్షలమంది భారతీయులు హెచ్‌-1బీ వీసాపై అమెరికాకు వెళ్లి పనిచేస్తున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంతేకాదు హెచ్‌-1బీ వీసాలు అందుకుంటున్న వారిలో భారతీయ నిపుణులే అధికంగా ఉన్నారు.

Related Posts