YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సాహిత్యం

సహజీవనం వల్ల పెద్దగా ఒరిగే

 సహజీవనం వల్ల పెద్దగా ఒరిగే

- స్వేచ్చ పట్ల ఆమే డెఫినేషన్స్ ఆమెవి..

- నీల..స్త్రీ తనను తాను ఏ రకంగా గౌరవించుకోవాలో చెప్పే నవల 

"నీల" ఇప్పుడే పూర్తి చేశాను. ఒక స్త్రీ జీవితంలోని లోతుల్నీ, ఆశయాలని, కోరికలని ఆమే చేరుకున్న గమ్యాన్ని చేరవల్సిన లోతుల్ని అన్నిటినీ సుదీర్ఘంగా చర్చకు లేవదీశారు ఈ రచనలో మల్లీశ్వరీ. ముఖ్యంగా మానవీయ స్వేచ్చ కోసం ఒక తపన కనిపిస్తుంది ఈ నవలలో. నీల జీవితంలో ఆమే వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు, కాల మాన పరిస్థితులు అన్నిటినీ చర్చిస్తూ, జూట్ మిల్ ఉద్యమం, సారా వ్యతిరీక ఉద్యమం, తెలంగాణ ఉద్యమ వాతావరణం, వీటన్నిటినీ స్పృశిస్తూ వెళ్ళారు. ఈ నవలలో వచ్చే ప్రతి స్త్రీ పాత్ర తన జీవితంలో ఒక మెరుగైన జీవనం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రతి సందర్భంలో తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూ వెళ్ళారు. అయితె ఎవరి దారి మంచిది అనే వాదన పెట్టుకోలేదు రచయిత్రీ. చంద్రకళ లాంటి పాత్రల అక్రమ సంబంధం (సమాజం పెట్టీన పేరు) కూడా ఒక పోరాట చర్యగానే చూడాలి. సరళ కూడా తనదైన రీతిలో ఒక మెరుగైన జీవనం కోసం పోరాటం చేసింది. ప్రసాద్ ను సాధించుకోవడానికి తన దారిలో కష్టపడింది. నీల భర్త ప్రసాద్ సరళతో సంబంధాన్ని నడుపుతూ తన కోసం అంటూ నీలని వివాహం చేసుకుంటాడు. సరళ లాంటి స్త్రీలను ఉపయొగించుకోవడం తప్ప చట్టబద్దమైన రక్షణ కల్పించవల్సిన అవసరం వచ్చినప్పుడు ఒక పురుషుడిగా సమజం తనకు ఇచ్చిన వసులుబాటును తనకు అనుకూలంగా వాడుకుంటాడు. అటువంటి పురుషున్ని తన అధీనం చేసుకోవడానికి సరళ ఒక పెద్ద పోరాటమే చేస్తుంది. ఆమేలో ఆ లౌక్యం, తెలివి, లేకపోతే ఆమే జీవితం ఎప్పుడో రోడ్డుమీద పడేది. ఎందుకంటే తన జీవితానికి ఒక పురుషుని అండ అవసరం అని నమ్మిన స్త్రీ ఆమే. ఆ నమ్మకానికి అనుకూలంగానే ప్రవర్తించింది.

నీల భర్త నుండీ విడిపోవడంలో ఔచిత్యం ఉంది. భర్త నుండి కేవలం చట్టపరమైన రక్షణ తన పిల్లకి ఒక అండ లాంటి ఆలోచనలతో జీవితం గడిపే వ్యక్తి కాదు నీల. తనకి జీవితంలో ఏం కావాలో అప్పటికి స్పష్టమైన అవగాహన లేకపోయినా ఇప్పుడు జీవిస్తున్న జీవితం తనది కాదు అనే స్పష్టత తనలో ఉంది అది సూర్యం, వసుంధర, రవి లాంటి వ్యక్తుల వల్ల ప్రభావితం అయిన తన మేధ వలన కావచ్చు. నేను ఇంత కంటే మెరుగైన జీవితానికి అర్హురాలిని అని తాను నమ్మిన సిద్దాంతం వలన కావచ్చు, అందుకే గృహహింసను లలిత చెప్పినట్లుగా సర్దుకుపోలేకపోయింది. ఆరంజ్యోతి లాంటి వ్యక్తుల ప్రభావం కూడా తనకు లోపల ఉండిఉన్న కారణంగా జీవితంలో పోరాటానికే సిద్దపడి భర్త నుండి విడిపోతుంది. తనను తను మలచుకునే నేపద్యంలో శ్రమిస్తుంది. అజిత దగ్గర పనికి కుదురుతుంది. అజిత బాల్య వివాహపు నీడలోనుండి బైటపడి వంటరి స్త్రీ గా కోరి జీవిస్తుంది. అది ఆమే చాయిస్. అనాది కాలం నుండి ఈ ఒంటరిగా జీవించిన స్త్రీలు సమాజంలో మనకు కనిపిస్తారు. ఆ నాటి కాల మాన పరిస్థితులకు అనుకూలంగా ఒక మార్గాన్ని ఎన్నుకుని జీవించారు. భారత దేశంలో మీరాబాయి, అటువంటి స్త్రీయే. పాశ్చాత్య దేశాలలో జేన్ ఆస్టన్, ఎమిలి డికిన్సన్ వంటీ మహా రచయిత్రిలు తమ చాయిస్ తో ఒంటరి జీవితాన్ని ఎన్నుకున్న వారే. అజిత జీవితంలో కొన్ని అనుభవాలున్నా అవి తన జీవితాన్ని ప్రభావితం చేయకుండా ఒక పర్సనేల్ స్పేస్ తనకోసం నిర్మించుకుని జీవితాన్ని గడీపేస్తూ ఉంటుంది. ఇక వసుంధర, సమాజంలోని స్త్రీల కోసం పరితపిస్తూ పోయే స్త్రీ. తనకు సదాశివకు మధ్య ఒక అనుబంధం ఉన్నా అది నీల సదాశివ జీవితంలో ప్రవేశించిన తరువాత అంతే గౌరవంతో తప్పుకుంటుంది. తను సరళ కాదు కాబట్టే నీల జీవితంలో ఒక మంచి అధ్యాయం మొదలవుతుంది. భర్త నుండి వేరుపడి పరదేశితో మొట్టమొదట ప్రేమలో పడీనా చేతన అనే మరో స్త్రీతో పరదేశికి సంబంధం ఉంది అని తెలిసి తనకోసం చేతనను వదిలేయడానికి సిద్దపడ్డ పరదేశితో బంధం తెంచుకుంటుంది నీల. కాని ఎందరితోనో అటువంటీ బంధాలున్న సదాశివను నమ్మి అతనితో సహజీవనాన్ని కాదనదు. ఇక్కడ పెద్ద లాజిక్ కనపడదు. ఒక కన్ప్యూషన్ లోనే పరదేశిని కాదంది అనిపించింది. తన తల్లి లా మరో స్త్రీ జీవితంలోకి ప్రవేశించడం తనకు ఇష్టం ఉండదు. కాని ఇక్కడ సదాశివ ఎందరో స్త్రీలతో కలిసి ఉన్న వ్యక్తి. అతను తనకు ఆలంబన అవుతాడని ఆమె నమ్మడం కేవలం అప్పటి భావతీవ్రత, అజిత లాంటి స్త్రీలను గమనిస్తూ సంపూర్ణ లాంటి స్త్రీల జీవితాన్ని దగ్గరగా చూస్తూ నైతికత పట్ల మారుతున్న ఆమే అభిప్రాయాలు అయి ఉండవచ్చు. సదాశివ ఆమేను ప్రేమించాడు. ప్రేమ కోసం అతని వెతుకులాట ఆమేతో అంతమయ్యిఉండవచ్చు అందుకే వసుంధర లాంటి స్త్రీ కూడా తనకు తాను వారి జీవితంలోనుండి తప్పుకుని ఒక మిత్రురాలిగా మాత్రమే ఉండిపోవడానికి మొగ్గు చూసిస్తుంది. ఇది ఒక పర్ఫెక్ట్ జంట కలిసినప్పుడు జరిగే పరిణామం గా మాత్రమే చూడాలి అని నాకు అనిపించింది. తరువాత పరదేశి తో స్నేహం, ఒక మెచ్యూరిటి ఉన్న స్త్రీ తీసుకునే నిర్ణయం. ఇక్కడ నీల వసుంధర స్థాయిని అందుకోగలిగింది. దాన్ని ప్రోత్సహించిన సదాశివ తమ బంధం పట్ల, తమ పరస్పర అనుబంధం పట్ల నమ్మకం ఉన్న మంచి ప్రేమికుడు. ప్రేమను పోందాలంటే దాన్ని బంధించకూడదనే నిజం తెల్సిన భావుకుడు.

అయితే నీల జీవితంలో ప్రతి మార్పుకు ఆమే చుట్టూ ఉన్న వ్యక్తులే కారణం. ఆమే జీవితం ఎందరో మంచి వ్యక్తుల సమాహారం. కాని నిజ జీవితాలు ఇంత చక్కగా ఉండవు. తమను తాము తీర్చుకోవడానికి ఇన్ని అనుకూలమైన స్థితులు స్త్రీలకు సాధారణంగా దొరకవు. తల్లి చనిపోయినా పెంచి పెద్ద చేసి వివాహం జరిపించిన పాష్టరమ్మ లాంటి కుటుంబాలు చాలా అరుదు. ఒక బడుగు స్త్రీ ఉన్నతి కోసం పరితపించె వసుంధర లాంటి వ్యక్తులు అరుదు. ఏ అండ లేని ఒక బాల్య స్నేహితురాలి కోసం తపించే సంపూర్ణ లాంటి వ్యక్తులు అరుదు. అజితలకు తమ జీవిత పోరాటానికే అలుపు వచ్చే పరిస్థితులు ఇక మరో స్త్రీ భాద్యత తీసుకునే వెసులుబాటు సమాజం ఇవ్వదు. పరదేశి లాంటి వ్యక్తులు అరుదే. చేతనను నీలను పోగొట్టుకుని సమాజం వైపు మళ్ళీన అతని మంచితనం వ్యక్తిత్వం ఒక అపురూపమైన నిది. అలాగే సదాశివ. ఇంత ఆర్ద్రతతో ఒక స్త్రీని అక్కున చేర్చుకునే పురుషులు, సదాశివ తల్లితండ్రులు, ఇందరి కలయికే నీల జీవితం. ఒక స్త్రీకి సాదారణంగా ఇటువంటి వ్యక్తులు ఒక్కరు తారసపడితేనే అల్లుకుపోతుంది. నీల జీవితం నిండా ఇంత మంది గొప్ప వ్యక్తులు. ఇటువంటి సామాజిక వాతావరణంలో నీల పోరాటం ఆమేను ఎంత ఉన్నత స్థాయికి తీసుకుపోగలదో అదే జరిగింది. సమాజం నుండి ఇటువంటి చేయూత ఏ స్త్రీకి దొరికినా ఆమే జీవితం ఇంతే అద్భుతంగా ఉంటుంది. స్వేచ్చపై నిర్వచనాన్ని ఇస్తూ ఒక స్త్రీ మనసుని ఆవిష్కరిస్తూ ఆమే చుట్టు అద్బుతమైన ప్రపంచాన్ని సృష్టించారు రచయిత్రి. నీలవేణీ నీలగా మారడానికి ఈ అధ్బుతమైన ప్రపంచమే కారణం అన్నది నాకు అనిపించింది. అటువంతి పరిస్థితులు ఇంత మంది గొప్ప వ్యక్తులు ఎందరి జీవితాలలో ఒకేసారి తారసపడతారు అన్నది మాత్రం ఒక ప్రశ్నే.

వివాహం మీద నమ్మకం సడలిపోతున్న రోజులివి. లివింగ్ రెలీషన్స్ ని సమర్ధిస్తున్న వ్యక్తులు పెరుగుతున్నారు. అసలు ఒక రోజు తంతు జీవితాలను ప్రభావితం చేయదు. గత వారం ఒక సెమినార్ లో రిలేషన్ షిప్స్ మీదే అధ్యయనం చేస్తున్న ప్రముఖ సైక్రియాటిస్ట్, రచయిత విజయ్ నాగసాయ్ గారి తొ ఒక చర్చలో పాల్గొనాను. ఏ బంధం అయినా ఇద్దరు వ్యక్తుల మీద ఆధారపడుతుంది కాని వివాహ వ్యవస్థ కన్నా ఈ సహజీవనం వల్ల పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు అన్న వారి వాదన కూడా ఆలోచించవల్సిన విషయం అనిపించింది. నిజానికి ఈ సహజీవనంతో ప్రెషర్ ఎక్కువగా ఉండి నలిగిపోతున్న జంటలు చాలా ఉన్నాయి అని వారు అన్నారు. సదాశివ లాంటి వ్యక్తులు ఎదురయ్యినప్పుడు పెళ్ళి అయినా, సహజీవనం అయినా ఒకే అనుభవాన్ని ఇవ్వవచ్చు. నీల తండ్రి పరశి లాంటి వ్యక్తితో పెళ్ళి అయినా సహజీవనం అయినా స్త్రీ జీవితం చంద్రకళ జీవితం లానే ఉంటుంది. బంధాలు మనుష్యులతో ఏర్పడతాయి, వారు ఆలోచన. అవగాహన, పరస్పర గౌరవాలపై అని నిలబడతాయి. ఈ ఒక్క సందేశం ఈ నవలలో పూర్తిగా రాలేదనిపించింది. పాష్టరమ్మ అనుమానాలను పరదేశీ తల్లి తండ్రులు ఆర్ధికపరమైన కాగితాలతోనే తీర్చగలిగారు. సదాశివ జీవితంలోకి వచ్చిన ప్రతి స్త్రీతో వారు ఇలాంటీ ఒప్పందానికి రాలేదు. రాలేరు కాని తన బిడ్డ జీవితం గురించి పాష్టరమ్మ అడిగినప్పుడు నీల జీవితానికి రక్ష ఉంటుంది అని కొన్ని కాగితాలను చూపించి నీలను తమ కోడలిగా స్వీకరించారు. ఇది ఒక రకమైన వివాహ ఒప్పందం లానే ఉంది. సహజీవం పట్ల కొన్ని అనుమానాలు, ఇన్సెక్యూరిటీలు ఉండడం సహజం. అదే ఇన్సెక్యూరిటి వివాహ వ్యవస్థలోనూ ఉంటుంది. అది పోవడానికి మాత్రమే చట్టబద్దత అవసరం. ఇక్కడ ఆ కాగితాలను పాష్టరమ్మ దాచి పెట్టూకుని తన బిడ్డకు అటువంటి సెక్యూరిటి చేకూర్చానని తృప్తి పడుతుంది. ఇది ఏ రకమైన బంధంలోనైనా ఆలోచించవలసిన విషయమే. ఇటువంటి భయం వ్యక్తుల ప్రెమ, ఆదరణతో తీరాలి అంతే. అందువల్లే నీల సహజీవనం వివాహ వ్యవస్థలో ఉండే సహజమైన భయాల తోనే ఏర్పడింది అని అనిపించింది తప్ప సహజీవనం వివాహం కన్న ఎదో మెరుగైన జీవనం స్త్రీకి ఇవ్వగలదు అన్న ఆలోచన నాకు కలగలేదు.

నీల కూతురు మినో నేటి తరానికి ప్రతినిధి. స్వేచ్చ పట్ల ఆమే డెఫినేషన్స్ ఆమెవి. ప్రతి తరం ఎదుర్కునే సమస్యే ఇది. అయితే తల్లి తండ్రుల ఇటువంటి బంధాలని పిల్లలు మినో ఆమోదించినట్లు ఆమోదించరు. మరో వివాహం చేసుకున్న, మరో పురుషుడితో ఉంటున్న స్త్రీ తన సంతానం విషయంలో నీల లా నిశ్చింతగా ఉండె పరిస్థితులు చాలా తక్కువ. ఇది గమనించవల్సిన విషయం. నీల జీవితంలో అటువంతి ఒడిదుడుకులు రచయిత్రి చూపలేదు.స్త్రీ తనను తాను ఏ రకంగా గౌరవించుకోవాలో చెప్పే నవల గా మాత్రం నీలను నేను చూశాను.

 

Related Posts