YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విదేశీయం

న్యాయస్థానంలో వైద్యుడిపై దాడి..

న్యాయస్థానంలో వైద్యుడిపై దాడి..

- అత‌నో జిమ్నాస్టిక్స్‌ డాక్ట‌ర్‌

- 265 మంది మ‌హిళా అథ్లెట్ల‌పై లైంగిక దాడికి పాల్ప‌డ్డ దుర్మ‌ర్గుడ‌త‌డు

ఒక్క‌రు కాదు ఇద్ద‌రు కాదు.. ఏకంగా 265 మంది మ‌హిళా అథ్లెట్ల‌పై లైంగిక దాడికి పాల్ప‌డ్డ దుర్మ‌ర్గుడ‌త‌డు. అత‌నో జిమ్నాస్టిక్స్‌ డాక్ట‌ర్‌. కానీ రెండు ద‌శాబ్దాలుగా వంద‌ల మంది అథ్లెట్ల‌ను ఇలా లైంగికంగా దోచుకుంటూనే ఉన్నాడు. అత‌ని పేరు లారీ నాస‌ర్‌. వ‌య‌సు 54 ఏళ్లు. అత‌ను లైంగిక దాడికి పాల్ప‌డిన వాళ్ల‌లో అమెరికాకు చెందిన టాప్ జిమ్నాస్ట్స్ ఉన్నారు. అందులో ఒలింపిక్స్ గోల్డ్ మెడ‌ల్స్ గెలిచిన అథ్లెట్లూ ఉండ‌టం గ‌మ‌నార్హం. మొత్తానికి ఈ కేసులో అడ్డంగా బుక్క‌యిపోయి కోర్టులో విచార‌ణ ఎదుర్కొంటున్నాడు. ఇప్ప‌టికే ఈ కేసులో 175 ఏళ్ల జైలు శిక్ష ఎదుర్కొంటున్నాడు.

రోజుకొక అథ్లెట్ ఫిర్యాదుతో అత‌నిపై విచార‌ణ ఇంకా కొన‌సాగుతూనే ఉన్న‌ది. తాజాగా మ‌రో ముగ్గురు అథ్లెట్లు నాస‌ర్‌కు వ్య‌తిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పారు. త‌మ‌ను కూడా అత‌ను లైంగికంగా వేధించిన‌ట్లు వాళ్లు తెలిపారు. ఆ స‌మ‌యంలో కోర్టు హాలులోనే ఉన్న ఆ ముగ్గురు అథ్లెట్ల తండ్రి రాండ‌ల్ మార్‌గ్రేవ్స్.. ఆ డాక్ట‌ర్‌పై దాడికి ప్ర‌య‌త్నించాడు.



అత‌న్ని ఒక్క ఐదు నిమిషాలు నాకు అప్ప‌గించండి అంటూ అత‌ను జ‌డ్జిని వేడుకున్నాడు. ఆ వెంట‌నే ఆ డాక్టర్‌పైకి దూసుకెళ్లి దాడికి ప్ర‌య‌త్నించాడు. అయితే అక్క‌డే ఉన్న‌పోలీసులు అత‌న్ని అడ్డుకొని సంకెళ్లు వేశారు. అరెస్ట్ చేసినా.. వెంట‌నే విడిచిపెట్టారు. అత‌ని ఆవేశం అర్థం చేసుకున్న జ‌డ్జి కూడా మార్‌గ్రేవ్స్‌కు ఎలాంటి శిక్ష వేయ‌కుండా వ‌దిలేశారు. ఇప్ప‌టికే 175 ఏళ్ల జైలు శిక్ష ఎదుర్కొంటున్న డాక్ట‌ర్ నాస‌ర్‌కు మ‌రో 15 నుంచి 20 ఏళ్ల శిక్ష ప‌డే అవ‌కాశం ఉంది.

Related Posts