YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఎవరీ సంస్థ ఛైర్మన్ తో మంత్రి లోకేష్ భేటీ

ఎవరీ సంస్థ ఛైర్మన్ తో మంత్రి లోకేష్ భేటీ

ప్రపంచలోనే అతి పెద్ద ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు తయారీ చేసే ఎవరీ సంస్థను  మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ఎవరీ కంపెనీకి ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ తయారీ లో 550 పేటెంట్స్ వున్నాయి. ఎవరీ కంపెనీ చైర్మన్ చార్లెస్ తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన తరువాత  స్టార్ట్ అప్ రాష్ట్రంగా అభివృద్ధి కోసం పరుగు పెడుతున్నాం. 2022 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన మొదటి మూడు రాష్ట్రాల్లో ఒక్కటి గానూ,2029 దేశంలో నెంబర్ వన్ స్థానంలోనూ, 2050 కి ప్రపంచంతోనూ పోటీ పడాలి అని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామని మంత్రి అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ ఒన్ గా ఉన్నాం...పరిశ్రమలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ద్వారా వరుసగా రెండోసారి నెంబర్ ఒన్ స్థానంలో ఉన్నాం. దేశంలో విద్యుత్ ఛార్జ్ లు పెంచం అని ప్రకటించిన ఓకే ఒక   రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కంపెనీల ఏర్పాటు అవసరమైన అనుమతులు, భూముల కేటాయింపులు,మౌలిక సదుపాయాల కల్పన త్వరితగతిన ఇస్తున్నాం. కంపెనీల ఏర్పాటు లో ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతీ వారం పర్యవేక్షణ చేస్తున్నారని అన్నారు. మీ సమయం మేము వృధా చెయ్యం...ఒప్పందం చేసుకున్న వెంటనే యుద్ధ ప్రాతిపదికన మీకు కావాల్సిన అనుమతులు కేటాయిస్తాం. ఎలక్ట్రానిక్స్ తయారీ కి తిరుపతి హబ్ గా మారుతుంది. ఆటోమొబైల్ రంగంలో అతి పెద్ద కంపెనీ కియా ఏపీకి వచ్చింది.18 నెలల్లో ఈ కంపెనీ నిర్మాణం పూర్తి అవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో నీటి కొరత లేదు ,దేశంలో రెండు నదులను అనుసంధానం చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 24 నిరంతర విద్యుత్ అందిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ తయారీ జరగాలి అని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కి వచ్చి పెట్టుబడులు పెట్టాలి అని  అన్నారు. కంపెనీ చైర్మన్ చార్లెస్ మాట్లాడుతూ ఇండియాలో మార్కెట్ పెరుగుతుంది. మీ దేశంలో పెట్టుబడి పెట్టే ఆలోచన మాకు ఉంది. మీ రాష్ట్రం విజన్ నాకు నచ్చింది. త్వరలోనే మా బృందం మీ రాష్ట్రానికి వస్తుంది. రాష్ట్రంలో పర్యటించి అక్కడ ఉన్న పరిస్థితులు అంచనా వేసుకొని పెట్టుబడి పెట్టే అంశంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. 

Related Posts