
కుప్పం
చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను ఆదు కుంటాము... వారికి గిట్టుబాటు ధర ఇవ్వడంపై ఇవాళ అధికారులతో మాట్లాడుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
కుప్పంలో పర్యటనలో వున్న ముఖ్యమంత్రి గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది భారీగా మామిడి పంట వచ్చింది... దీనివల్ల కొంత సమస్య వచ్చింది. ఇంటికి ప్రచారం కార్యక్రమం ప్రతి ఎమ్మెల్యే చేపట్టాలి. చిత్తూరు రైతాంగానికి వారు ఒక్క రూపాయి ఇచ్చిన చరిత్ర లేదు. ఐదేళ్లు ఎవరూ మాట్లాడలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇది బాధ్యత కలిగిన ప్రభుత్వం. ప్రతి చిన్న విషయాన్ని సీరియస్ గా తీసుకొని పరిష్కరిస్తున్నామని అన్నారు.
ఎన్నో ఇబ్బందులు ఉన్నా, హామీలు నెరవేరుస్తున్నాము. ప్రతి నెల మొదటి వారంలో గ్రామాల్లో పండుగ వాతావరణం ఉంది. వాలంటీర్లు లేకుంటే పథకాలు ఇవ్వలేమని తప్పుడు ప్రచారం చేసారు. భూమి రికార్డులు తారుమారు చేసారు.... భూమి మూల పత్రాలు లేకుండా చేసి పథకం ప్రకారం దోచుకున్నారు. వివేకానంద రెడ్డిని హత్య చేసి, నా చేతిలో కత్తి పెట్టారు. సింగయ్య కారు కింద పడితే, కారు దిగి కాపాడే ప్రయత్నం చేయలేదు. కుక్కను పడేసినట్లు సింగయ్యను పక్కన పడేశారు. ఇప్పుడు సింగయ్య కుటుంబాన్ని బెదిరించి మాట్లాడిస్తున్నారని అన్నారు.
2029 కల్లా పేదరికం లేని సమాజం చూడాలన్నది నా కల. బనకచర్ల ప్రాజెక్ట్ తో ఎవరికీ నష్టం లేదు. వృధా అవుతున్న గోదావరి నీళ్లు వాడుకోవాలన్నదే మా ఉద్దేశం. రెండు వేల టీఎంసీల నీళ్లు సగటున ప్రతి ఏడాది వృథాగా సముద్రంలోకి పోతున్నాయి. 200 టిఎంసి ల నీళ్లు వాడుకోవడం వల్ల ఎవరికీ నష్టం లేదు. ఎగువన ఉన్న తెలంగాణ వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటే నేను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. ఇకపై చేయను కూడా అని అన్నారు.