YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

టోంగ్డా అధినేతతో మంత్రి లోకేష్ భేటీ

టోంగ్డా అధినేతతో మంత్రి లోకేష్ భేటీ

టోంగ్డా కంపెనీ వైస్ ఛైర్మెన్ వాన్గ్ యాహువా తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. మొబైల్ ఫోన్ల ప్లాస్టిక్ కేసింగ్ తయారీ లో ఉన్న టోంగ్డా లో 24 వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 60 శాతం షామి ఫోన్లకు టోంగ్డా ప్లాస్టిక్ కేసులు ఉపయోగిస్తారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ ద్వారా మీ కంపెనీ కి అవసరమైన విధంగా మా రాష్ట్రంలో యువతి యువకులకు నైపుణ్య శిక్షణ అందిస్తామని అన్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ కి రావాలి అని నిర్ణయం తీసుకుంటే 21 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తాం. కంపెనీ ఏర్పాటు కు కావాల్సిన మౌలిక సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుంది. ఇండియాలో స్మార్ట్ ఫోన్ వాడకం ఘననీయంగా పెరుగుతుందని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా రాయితీలు ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలి అని కోరారు. వాన్గ్ యాహువా మాట్లాడుతూ ఇప్పటి వరకూ చైనా బయట మేము పెట్టుబడులు పెట్టలేదు. ఇండియా లో పెట్టుబడులు పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి సానుకూలంగా ఉన్నాం. అక్టోబర్ 2 వ వారంలో ఆంధ్రప్రదేశ్ కి మా బృందం వస్తుంది. పర్యటన తరువాత నిర్ణయాన్ని ప్రకటిస్తాం. కంపెనీ ఏర్పాటు చేస్తే సుమారుగా 5 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. దానికి అవసరమైన నైపుణ్యం ఉన్న వారు కావాల్సి ఉంటుందని మంత్రికి వివరించారు.

Related Posts