YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఇండోనేషియాలో సునామీ వార్నింగ్

ఇండోనేషియాలో సునామీ వార్నింగ్

ఇండోనేషియాలో మరో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.7 గా నమోదైంది. దీంతో అక్కడి అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇండోనేషియాలోని సులవేసి దీవిలో ఈ భూకంప కేంద్రం నమోదైంది. ఇదే ప్రాంతంలో కొన్ని గంటల కిందట స్వల్పంగా భూమి కంపించింది. మధ్య, పశ్చిమ సులవేసి ప్రావిన్స్‌లలో అధికారులు ముందస్తు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలందరినీ ఎత్తయిన ప్రదేశాలకు తరలిస్తున్నారు. అమెరికా జియోలాజికల్ సర్వే మొదట భూకంప తీవ్రత 7.7గా నమోదైందని చెప్పినా.. తర్వాత దానిని 7.5గా సవరించింది.ఇదే ప్రాంతంలో కొన్ని గంటల కిందట వచ్చిన భూకంపం కొన్ని ఇండ్లను ధ్వంసం చేయగా.. ఓ వ్యక్తి మరణించాడు. ఇదే సులవేసికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంబోక్ దీవుల్లో జులై, ఆగస్ట్‌లలో సంభవించిన భూకంపాలు 500 మందికిపైగా ప్రజలను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న ఇండోనేషియాలో తరచూ భారీ భూంకపాలు సంభవిస్తూనే ఉంటాయి. 2004లో సుమత్రా దీవుల్లో వచ్చిన భారీ భూంకంపం కారణంగా వచ్చిన సునామీ ఇండియాతోపాటు 13 దేశాలపై ప్రభావం చూపింది. 2 లక్షలకుపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు

Related Posts