YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

ఊపందుకున్న స్టాక్‌మార్కెట్లు

ఊపందుకున్న స్టాక్‌మార్కెట్లు

- 8 పైసలు బలహీనపడిన రూపాయి విలువ

-  రూ. 64.33గా ట్రేడవుతున్న.డాలర్‌తో రూపాయి మారకం

స్టాక్ మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. వరుసగా ఏడు సెషన్లలో భారీ నష్టాల బాటపట్టిన స్టాక్‌మార్కెట్లు గురువారం ఊపందుకున్నాయి. ఈ రోజు ఉదయం ట్రేడింగ్‌ ఆరంభంలో కోలుకున్నాయి. ఫలితంగా ఐటీ, బ్యాంకింగ్‌, ఫార్మా రంగాల షేర్లతో భారీ లాభాల దిశగా సూచీలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఆసియా మార్కెట్లు కూడా సానుకూలంగా ఉండటంతో మార్కెట్‌ సెంటిమెంట్‌కు మరింత బలాన్ని చేకూర్చినట్టుయింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో సెన్సెక్స్‌ 432 పాయింట్లు ఎగబాకి 34,514 వద్ద ట్రేడ్ అవ్వగా, నిఫ్టీ 123 పాయింట్ల లాభంతో 10,600 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.
సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా, ఐడియా, ఎస్‌బీఐ, రిలయన్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో సిప్లా 5 శాతం మేర ర్యాలీ సాగించింది. టారో ఫలితాల అనంతరం సన్‌ ఫార్మా 2.6 శాతం, అరబిందో ఫార్మా 1 శాతం కిందకి పడిపోయాయి. అయితే నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 0.3 శాతం పాజిటివ్‌గా ప్రారంభమైంది. కాగా, సింగపూర్‌ స్టాక్ ఎక్స్చేంజ్‌లో ట్రేడవుతున్న నిఫ్టీ ఫ్యూచర్స్‌  నుంచి బలమైన సంకేతాలు రావడంతో, దేశీయ స్టాక్‌ మార్కెట్లు కూడా బలపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 8 పైసలు బలహీనపడి 64.33గా ట్రేడవుతోంది.

Related Posts