YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

వచ్చే ఎన్నికలు కేసీఆర్‌కు పెద్ద సవాలే..

వచ్చే ఎన్నికలు కేసీఆర్‌కు పెద్ద సవాలే..

 అధికార పగ్గాలు మరోసారి దక్కించుకునేందుకు పావులు కదుపుతున్న టీఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్ కు వచ్చే ఎన్నికలు కొత్త సమస్యలు సృష్టించేలా కనిపిస్తున్నాయి. పార్టీ పరంగా పూర్తి స్థాయి నిర్మాణం లేకపోవడంతో కింది స్థాయి కార్యకర్తల నుంచి మెజార్టీ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తుస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికలు కేసీఆర్‌కు పెద్ద సవాలేనని పార్టీ నేతలు భావిస్తున్నారు.

పునర్విభజన జరగలేదు....
కేసీఆర్‌ చాలాసార్లు చెప్పినట్టు నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో టికెట్లపై ఆశలు పెట్టుకున్న నేతలు నీరుకారిపోతున్నారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలస వచ్చిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇలాంటి చోట్ల పార్టీ నేతలు, కార్యకర్తల్తో స్తంబ్దత నెలకొంది. టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ నేతృత్వంలో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదన్న ఉద్దేశంతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని కోదండరామ్‌ చేసిన ప్రకటనతో టీఆర్‌ఎస్‌లో గుబులు మొదలైంది. ఈ పరిణామం గులాబీ నేతలకు రుచించడం లేదు. ఎన్నికలకు మరో ఏడాది సమయమే ఉంది. అయినా పార్టీ నిర్మాణంపై గులాబీ బాస్‌ ఇంకా పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించలేదు. మరోవైపు వచ్చే ఎన్నికల కోసం ప్రతిపక్షాలు ఇప్పటికే అధికార పార్టీపై విమర్శల దాడిని పెంచాయి. ఇలాంటి పరిణామాలు గులాబీ నేతల్లో కొత్త ఆలోచనల్లోకి నెట్టివేస్తున్నాయి. అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని అన్నీ తానై నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో తనదైన మార్క్‌ కోసం పలు పథకాలు ప్రేవేశపెట్టినా... పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్తిని మాత్రం చల్లార్చడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

టీజాక్ పార్టీ ఏర్పాటు చేయడం
ఉద్యమంలో టీఆర్‌ఎస్‌ కనుసన్నల్లో నడిచిన టీజాక్ పార్టీ ఏర్పాటు చేయడం ఖరారు కావడంతో... గులాబీ దళంలోని అసంతృప్తిగా నేతలు, ఉద్యమకారులు కొత్త రాజకీయ పార్టీ వైపు మొగ్గుచూపే అవకాశాలు ఉంటాయని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనికి తోడు ఇప్పటికే 10 నుంచి 15 మంది శాసనసభ్యులు తమతో టచ్ ఉన్నారని ప్రకటనలు చేస్తున్న కోదండరాం వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌ నేతల్లో మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. పార్టీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చక్కదిద్దుకోవాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

Related Posts