YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

 స్టాక్ మార్కెట్ బుడగ ‘‘ సమస్య కావద్దు

 స్టాక్ మార్కెట్ బుడగ ‘‘ సమస్య  కావద్దు

 నియంత్రణ సంస్థలు రిస్కులను గుర్తె రేగాలి..

మార్కెట్లలో సర్దుబాటు చోటుచేసుకుంటోందన్న ఆర్.బి.ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్

స్టాక్ మార్కెట్ బుడగ ‘‘చాలా ప్రధాన సమస్యగా దారితీయకూడదు’’ అని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్.బి.ఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ అన్నారు. మున్ముందు ఎదురు కాగల రిస్కులను మార్కెట్ల నియంత్రణా సంస్థలు గుర్తించవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. దేశీయ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో ఇటీవల ఈక్విటీల ధరలు ఘోరంగా పతనమవడం గురించి ఆయన ప్రస్తావించారు. ‘‘అంతర్జాతీయంగానే కాక, ఇండియాలోనూ ఇప్పటికే సర్దుబాటు చోటుచేసుకుంటోంది. క్యాపిటల్  మార్కెట్లు ఎలా దిశ మార్చుకోగలవో ఇది మనకు తెలియజెబుతోంది’’ అని ఉర్జిత్ అన్నారు. ‘‘ఈ బుడగ చాలా ప్రధాన సమస్యగా దారితీయగల సూచనలు ప్రస్తుతానికి ప్రపంచ మార్కెట్లలోగానీ, భారతదేశంలోగానీ, ఇంతవరకు కనిపించలేదు. అయినా, మున్ముందు ఎదురు కాగల సమస్యలను ఫైనాన్షియల్ మార్కెట్ నియంత్రణా సమస్యలైనా  ఆర్.బి.ఐ, భారతీయ సెక్యూరిటీలు, ఎక్చ్సేంజ్ బోర్డు (సెబీ) గుర్తెరగాలి’’ అని ఉర్జిత్ స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ సమర్పించిన తర్వాత, ఆర్థిక మంత్రి ఆర్.బి.ఐ బోర్డు నుద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీ. అలా అరుణ్ జైట్లీ ప్రసంగించిన తర్వాత, ఉర్జిత్ పటేల్ విలేకరులతో మాట్లాడారు. గత కొద్ది రోజులుగా మార్కెట్లలో చోటుచేసుకుంటున్న సర్దుబాటుతో మార్కెట్ సూచీలు చాలా వేగంగా కదలగలవనే విషయం మరోసారి స్పష్టవైుపోయిందని అన్నారు. ‘‘ఈ అధిక ఈక్విటీ ధరల చక్రభ్రమణంలో ఓ మంచి సంగతి ఉందని అనుకుంటున్నాను. అదేమిటంటే, ఇందులో భాగస్వామిగా ఉన్న దాదాపు ప్రతి ఒక్కరూ, ఇది ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని, సర్దుబాటుకు అవకాశం ఉందని చెప్పడమే. అది మంచి పరిణామమని అనుకుంటున్నాను. అంతర్జనితంగానే రిస్కు పట్ల తగినంత విముఖత ఉంది. మదుపరులే దానిని పెంపొందిస్తూ వచ్చారు’’ అని ఉర్జిత్ అన్నారు. అంతర్జాతీయ ఈక్విటీల ధరలు కుప్పకూలడంతో ఈ వారంలో భారతీయ స్టాక్ మార్కెట్లు కూడా ఒక్క సెషన్‌లో తప్పించి తీవ్ర పతనాన్ని చవి చూశాయి. 

గీటురాయిగా భావించే సెన్సెక్స్ శుక్రవారం ఒక శాతం పైగా క్షీణించి, గత నెల రోజుల్లో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. సెన్సెక్స్ గురువారం 330 పాయింట్లను మూటగట్టుకోగలిగిందికానీ, అంతకుముందు ఏడు ట్రేడింగ్ సెషన్లలో అది 2,200 పాయింట్లకు పైగా కోల్పోయింది. దేశీయంగాను, అంతర్జాతీయంగాను కూడా కనపడిన ప్రతికూల సంకేతాలే దానికి కారణం. బ్యాంకుల వడ్డీ రేట్ల గురించి అడిగినపుడు, ఒక బ్యాంకు రెండు రోజుల క్రితం మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎం.సి.ఎల్.ఆర్)ను తగ్గించిన సంగతిని ఉర్జిత్ తెలిపారు. ‘‘లబ్ధి బదలీ విషయానికి వస్తే, ద్రవ్య విధాన కమిటీ ప్రారంభించిన సడలింపు చక్రభ్రమణం నుంచి, ఇప్పటి ఎం.సి.ఎల్.ఆర్ వరకు దానిని పోల్చి చూస్తే, వాస్తవానికి బదిలీ బాగుందని చెప్పాల్సి ఉంటుంది. వాస్తవంగా, ఏం జరిగిందంటే, ఆ బదలీ ఆలస్యంగా చోటుచేసుకుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా కొంత బదలీ చోటుచేసుకుందని నేను అంగీకరించి తీరాలి. ఎందుంకంటే, మన వ్యవస్థలో ఫైనాన్షియల్ మధ్యవర్తిత్వం చోటుచేసుకుంటోంది’’ అని ఉర్జిత్ పటేల్ వ్యాఖ్యానించారు. 

కనీస మద్దతు ధరపై చర్చించాం
ఈక్విటీలపై దీర్ఘకాల మూలధన లాభ పన్నును పునఃప్రవేశపెట్టాలని ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రతిపాదించిన సంగతి గురించి శనివారంనాడు సెబి బోర్డుతో జరిపిన సమావేశంలో చర్చించినట్లు  అరుణ్  జైట్లీ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే, ఆర్.బి.ఐ బోర్డుతో సమావేశంలో ఆ అంశం ప్రస్తావనకు రాలేదని ఆయన అన్నారు. ‘‘ఆర్.బి.ఐతో జరిపిన సమావేశంలో (వ్యవసాయ ఉత్పత్తులకు) కనీస మద్దతు ధర గురించి చర్చించాం. ఎందుకంటే, ఈ సమావేశం బడ్జెట్ నేపథ్యంలో చోటుచేసుకుంది. దానిని ఎలా అమలుజరపాలి, రైతులపై, వస్తువుల ధరలపై అది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఎగుమతుల పోటీ సామర్థ్యం ఎలా ఉంటుంది వంటి అంశాలన్నింటినీ విద్యాపరంగా చర్చించాం’’ అని జైట్లీ చెప్పారు. 

Related Posts