YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పాలస్తీనా చేరిన ప్రధాని మోడీ..

పాలస్తీనా చేరిన ప్రధాని మోడీ..

-  పాలస్తీనాలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని

మూడు పశ్చిమాసియా దేశాల పర్యటనలో భాగంగా జోర్దాన్‌ పర్యటన ముగించుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం పాలస్తీనా చేరుకున్నారు. పాలస్తీనాలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని మోదీ కావడం విశేషం. రామల్లా చేరుకున్న మోదీ తొలుత పాలస్తీనా ప్రధాని రమీ హమదల్లాతో కలిసి పాలస్తీనా లీడర్‌‌ యస్సర్‌ అర్ఫాత్‌ సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ, అధ్యక్షుడు అబ్బాస్‌ పలు ద్వైపాక్షిక అంశాలు, అంతర్జాతీయ పరిస్థితుల గురించి చర్చలు జరపనున్నారు. రమల్లా చేరుకున్న మోదీ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌ను కలుసుకోనున్నారు.
ఇరుదేశాల నేతలు ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా పలు రంగాలకు చెందిన ఆరోగ్యం, విద్య, సంస్కృతి, మహిళల సాధికారిత సహా ఇతర ఒప్పందాలపై ఇరుదేశాల నేతలు చర్చించనున్నారు. ‘భారత తొలి ప్రధానిగా మోదీ పాలస్తీనా పర్యటించి చరిత్ర సృష్టించారు. జోర్దాన్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ రక్షణగా హెలికాప్టర్‌లో రమల్లాకు మోదీ చేరుకున్నారు’ అధికారి ఒకరు ట్వీట్ చేశారు. కాగా, పాలస్తీనా పర్యటన ముగించుకున్న అనంతరం మోదీ శనివారం సాయంత్రం నాటికి అబుదాబి చేరుకుంటారు. 

Related Posts