YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భారతీయులు వెళితే అధోగతే....

భారతీయులు వెళితే అధోగతే....

హైదరాబాద్, జూలై 28,
అగ్రరాజ్యం.. ప్రపంచానికి పెద్దన్నగా చెలామణి అవుతున్న అమెరికా.. అధ్యక్ష పగ్గాలు జనవరిలో డొనాల్డ్‌ ట్రంప్‌ చేపట్టారు. అప్పటి వరకు సాఫీగా సాగుతున్న అమెరికా ట్రంప్‌ రాకతో ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. తలతిక్క నిర్ణయాలు.. తలా తోక లేని ఉత్తర్వులు, ఆదేశాలతో ఇటు అమెరికన్లను, అటు అమెరికాలోని విదేశీయులు ఇబ్బంది పడుతున్నారు. దీనికితోడు టారిఫ్‌ల పేరుతో ప్రపంచ దేశాలను భయపెడుతున్నారు. తాజాగా భారత ఐటీ నిపుణులే లక్ష్యంగా అమెరికాలోని ఐటీ కంపెనీలకు నేరుగా వార్నింగ్‌ ఇచ్చారు. భారతీయులను నియమించుకోవద్దని ఆదేశించారు. ట్రంప్‌ వ్యాఖ్యల నేపథ్యంలో భారతీయులు అగ్రరాజ్యాన్ని వీడితే అడుక్కు తినాల్సి వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.అమెరికా దశాబ్దాలుగా అగ్రరాజ్యంగా కొనసాగుతుండడానికి భారతీయులు కూడా కారణం. ఇండియన్‌ ఐటీ ప్రొఫెషనల్స్‌.. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో కీలకంగా ఉన్నారు. అనేక సంస్థల ఆర్థికాభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. అమెరికాకు ఆర్థికంగా, సామాజికంగా మంచి గుర్తింపు తెస్తున్నారు. ఇండియన్స్‌ లేకుంటే.. అమెరికా లేదు అని ఆ దేశ మాజీ అధ్యక్షుడు మూడు దశాబ్దాల క్రితం అన్న మాటలు ఇక్కడ ప్రస్తావించుకోవాలి. మన ఐటీ నిపుణుల కారణంగానే 30 శాతం అమెరికా ఐటీ కంపెనీలు మనుగడ సాధిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. భారతీయులపై ట్రంప్‌ వ్యతిరేకత గురించి ఆలోచిస్తే ఆయన కోణంలో అది సరైనదే. ‘అమెరికా ఫస్ట్‌‘ పాలసీ ఆయన వ్యక్తిగతమైనది.. దీనిని అమెరికా అంతటా బలవంతంగా రుద్దడం సరికాదని నిపుణులు పేర్కొంటున్నారు.ట్రంప్‌ వ్యతిరేకత.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుని భారతీయులు అగ్రరాజ్యాన్ని వీడితే, అమెరికాలోని టెక్నాలజీ, ఇతర కీలకమైన రంగాలలో ప్రభావం ఉంటుంది. భారతీయులు హెచ్‌–1బీ వీసాల ద్వారా అమెరికాలో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ఈ ఉద్యోగాలు అమెరికన్‌ ఆర్థిక వ్యవస్థకు కీలకమైనవి. ఈ ఉద్యోగాలు తగ్గితే, అమెరికన్‌ కంపెనీలు నైపుణ్యం గల ఉద్యోగుల కొరత ఏర్పడుతుంది. ఇది ఖర్చులు, సమయం పెరుగుతుంది. అలాగే, భారతీయులు అగ్రరాజ్యాన్ని వీడితే, భారత్‌లోని టెక్నాలజీ రంగం మరింత బలోపేతం అవుతుంది, ఇది భారత ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుంది. అమెరికా నుంచి కంపెనీలు తరలిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే అక్కడ ఉన్నవారికి ఉద్యోగాలు కాకపోగా.. అమెరికా ఆర్థిక పరిస్థితి ఏడాది తిరగకుండానే దారుణంగా పడిపోతుంది. దీంతో నంబర్‌ వన్‌ స్థానం చైనా సొంతం అవుతుంది. అదే జరిగితే అమెరికా అడుక్కు తినాల్సిన పరిస్థితి వస్తుంది.

Related Posts