YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రముఖ పాత్ర జైపాల్ రెడ్డిదే

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రముఖ పాత్ర జైపాల్ రెడ్డిదే

హైదరాబాద్
కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి  6వ వర్ధంతి సందర్భంగా పీవీ నరసింహారావు మార్గ్ (నెక్లెస్ రోడ్) లోని స్పూర్తి స్థల్ లో ఆయన స్మారకానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పల్లె నుండి ఢిల్లీ దాకా ఎదిగిన భారత రాజకీయ శిఖరం, బెస్ట్ పార్లమెంటిరియన్ స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి. 1969లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అక్కడి నుండే వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత మహబూబ్ నగర్,మిర్యాలగూడ,చేవెళ్ల పార్లమెంట్ స్థానాల నుండి ఐదు సార్లు లోక్సభ సభ్యుడిగా గెలుపొందారు.  రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా,రాజ్య సభలో ప్రతిపక్ష నేతగా కూడా పనిచేసిన అపార రాజకీయ అనుభవం కలిగిన నేత జైపాల్ రెడ్డి.  ఉత్తమ పార్లమెంటేరియన్గా పురస్కారం అందుకున్న తొలి దక్షిణ భారత ఎంపీగా ఘన కీర్తి పొందారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రముఖ పాత్ర జైపాల్ రెడ్డి దే. హైదరాబాద్ కు ప్రపంచ స్థాయి మెట్రో జైపాల్ రెడ్డి  వల్లే సాధ్యమైంది. అధికారంలో ఉన్న,ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ విలువలు కలిగి ఉన్న నేత అయన  రాజకీయ జీవితం నేటి తరం నేతలకు ఆదర్శం..స్పూర్తి దాయకం. జైపాల్ రెడ్డి  గురించి చెప్పే అంత పెద్ద స్థాయి నాది కాదు.. ప్రపంచ దేశాలు గుర్తించే నాయకుడు జైపాల్ రెడ్డి. జైపాల్ రెడ్డి పెద్ద కుమారుడు అరవింద్ నేను ఇంజనీరింగ్ లో క్లాస్ మెట్. ప్రజల కోసం నిజాయితిగా పని చేసిన నాయకుడు జైపాల్ రెడ్డి. ఆయనకు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వని కోరుతున్నానని అన్నారు.
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కు జైపాల్ రెడ్డి పేరు పెట్టాము. ఐకే గుజ్రాల్ నేతృత్వంలో ఏర్పడ్డ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో..మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాల్లో కేంద్ర సమాచార ప్రసార శాఖ, పట్టణాభివృద్ధి శాఖ, పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహా మరికొన్ని శాఖలకు మంత్రిగా పనిచేశారు. వైకల్యానికి గురైన ఎన్నడూ నిరాశ చెందలేదు..అది ఆయన రాజకీయ జీవితానికి ఎన్నడూ అవరోధంగా భావించలేదు. సవాళ్ళకే సవాలుగా నిలిచిన వ్యక్తి జైపాల్ రెడ్డి. విద్యార్థి నాయకుని నుండి కేంద్ర మంత్రి గా ఎదిగారు. సవాళ్ళను సమర్థంగా ఎదుర్కొంటూ ఉన్నతంగా ఎదగాలనే నేటి తరానికి ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితమే నిదర్శనం. జైపాల్ రెడ్డి  మంచి వక్త. అపారమైన మేధస్సుతో పాటు అందరినీ ఆకట్టుకునే విశ్లేషణలు ఆయన సొంతం. తెలుగు, ఆంగ్ల భాషల్లో ఆయన అనర్గళంగా మాట్లాడే వారు. పార్లమెంట్ లో ఆయన మాట్లాడుతుంటే నిశబ్దంగా అందరూ వినేవారు. అంతటి విషయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారు కీలకంగా పనిచేశారు..వారి ఆశయాల మేరకు మా ప్రజా ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తున్నది. ఈ సందర్భంగా వారి సేవలు స్మరించకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాం." అని మంత్రి అన్నారు.

Related Posts