YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

జౌళి పరిశ్రమలో నైపుణ్య అభివృద్ధికి దృష్టి..

జౌళి పరిశ్రమలో నైపుణ్య అభివృద్ధికి దృష్టి..

నైపుణ్య అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించవలసిందిగా పశ్చిమ బెంగాల్ సాంకేతిక విద్యా శాఖ మంత్రి పూర్ణేందు బసు జౌళి రంగానికి విజ్ఞప్తి చేశారు. ‘‘పరిశ్రమల నుంచి అప్రెంటిస్‌లకు ఏమంత ఎక్కువ డిమాండ్ లేదు. జౌళి రంగం నుంచే ఎంతో కొంత కృషి సాగుతోంది. కనుక, జౌళి రంగాన్ని పరిరక్షించేందుకు ఆ రంగంలోనే నైపుణ్య అభివృద్ధి చోటుచేసుకోవాలి. ఈ విషయంలో ఇండియన్ జ్యూట్ మిల్స్ అసోసియేుషన్ కూడా ముందుకు వచ్చి తన వంతు చేయూత నందించాలి’’ అని పూర్ణేందు అన్నారు. అనియత రంగంలో ఇప్పుడున్న వర్కర్లను నిపుణులుగా తయారు చేయాలని కోరారు. వారున్న సేవల రంగాల్లో మెరుగ్గా అల్లుకుపోయేందుకు ఆ నైపుణ్యం వారి సాధికారతనిస్తుందని ఆయన చెప్పారు. చిన్న, సన్నకారు రైతులను నిపుణులను చేసే ప్రధాన కృషిని ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆయన చెప్పారు. జాతీయ స్థాయి అస్సెస్‌మెంట్లు, సర్టిఫికేషన్ కోసం సుమారు 16 నైపుణ్య రంగాలు అవగాహన పత్రాలపై సంతకాలు చేసిన సంగతిని ఆయన ప్రస్తావించారు.  కొత్త లాటులో కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టిన సవుయంలో జౌళి పరిశ్రమలో నైపుణ్యాల మధ్య వ్యత్యాసం అపారంగా ఉందని ఐ.జె.ఎం.ఏ చైర్మన్  సంజయ్ కజారియా అన్నారు. కొత్త యంత్రాలు, ప్రక్రియులను నడిపించడానికి పరిశ్రమకు ఏటా 15,000 మంది నిపుణుైలెన సిబ్బందికి కొరత ఏర్పడుతోందని ఆయన చెప్పారు. 

Related Posts