YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

రెండు దేశాల అభివృద్ధి కృషి

 రెండు దేశాల అభివృద్ధి కృషి

- మోదీని హారంతో సన్మానించిన పాలస్తీనా అధ్యక్షుడు

- పాలస్తీనాతో స్నేహానికి ఇది ఓ చిహ్నం
మూడు దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఇవాళ పాలస్తీనా చేరుకున్నారు. ఈ సందర్భంగా రమల్లాలో ఉన్న యాసర్ అరాఫత్ స్మారకం వద్ద మోదీ నివాళులర్పించారు. ప్రధాని వెంట ఆ దేశాధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్ ఉన్నారు. అనంతరం ఇండియా, పాలస్తీనా మధ్య ప్రధాని మోదీ, పాలస్తీనా ప్రెసిడెంట్ సమక్షంలో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా.. పాలస్తీనా ప్రెసిడెంట్.. పాలస్తీనా గౌరవానికి సూచిక అయిన హారాన్ని మోదీకి బహుమానం ఇచ్చారు.


దాన్నే గ్రేట్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా అని అంటారు. విదేశాల నుంచి వచ్చిన కింగ్స్, అధ్యక్షులు, ప్రధానులు, రాష్ర్టాలకు చెందిన ముఖ్యమైన వ్యక్తులు వచ్చినప్పుడు దాన్ని వాళ్లకు బహుకరిస్తారు. ఇప్పటి వరకు దాన్ని సౌదీ అరేబియా రాజు సల్మాన్, బహ్రెయిన్ రాజు హమాద్, చైనా ప్రెసిడెంట్ జి జిన్‌పింగ్‌కు ఇచ్చారు. ఇప్పుడు మొట్టమొదటి సారిగా వచ్చిన భారత ప్రధాని హోదాలో పాలస్తీనాకు వచ్చిన మోదీకి బహుకరించారు.

 

ఈ సందర్భంగా నెక్లస్ సన్మానానికి బదులుగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... ఇది భారతదేశానికి గౌరవం, పాలస్తీనాతో స్నేహానికి ఇది ఓ చిహ్నం. ప్రతి భారత పౌరుడి తరుపున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు. తమ విదేశీ పాలసీల్లో పాలస్తీనాకే ఎప్పుడూ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నారు. పాలస్తీనా ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లోనూ దైర్యం కోల్పోకుండా నిలబడటం నిజంగా అభినందించదగ్గదని ప్రధాని కొనియాడారు. పాలస్తీనాలో దౌత్య కార్యాలయం నిర్మాణం కోసం ఇండియా ఎప్పుడూ మద్దతు ఇస్తుందన్నారు. ఈ పర్యటనలో రెండు దేశాల అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని చూసి తాను ఎంతో సంతోషపడుతున్నానన్నారు. ఈ సంవత్సరం నుంచి ఇండియాకు వచ్చే పాలస్తీనా విద్యార్థుల సంఖ్యను 50 నుంచి 100కు పెంచుతున్నానన్నారు.

పాలస్తీనా గడ్డపై భారత ప్రధానికి ఘన స్వాగతం..

పాలస్తీనా గడ్డపై అడుగుపెట్టిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది.
ఇజ్రాయెల్ హెలికాప్టర్లు, రాయల్ జోర్డాన్ హెలికాప్టర్లు వెంటరాగా ప్రధాని మోదీ శనివారం పాలస్తీనా రాజధాని రామల్లా చేరుకున్నారు. 
అక్కడికి చేరుకోగానే తొలుత ఆయన పాలస్తీనా మాజీ అధ్యక్షుడు యాసర్ అరాఫత్ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. అక్కడి మ్యూజియంలోని సందర్శకుల పుస్తకంలో కూడా సంతకం చేశారు.
గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రధాని మోదీ పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్‌తో సమావేశమవుతారు. 
ఈ సందర్భంగా ఇరు దేశాలు పలు ఒప్పందాలు, ఎంవోయూలపై సంతకాలు చేయనున్నాయి...

Related Posts