YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విదేశీయం

అబుదాబిలో హిందూ దేవాలయానికి మోదీ భూమి పూజ

అబుదాబిలో హిందూ దేవాలయానికి మోదీ భూమి పూజ

అబుదాబి పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక్కడ తొలి హిందూ దేవాలయానికి భూమి పూజ చేశారు. తర్వాత యూఏఈ అమరవీరుల యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం భారత్ - యూఏఈ మధ్య ఐదు కీలక ఒప్పందాలు జరిగాయి. ఇంధన రంగం, మానవ వనరులు, ఆర్థిక సేవలు...రైల్వేలకు సంబంధించిన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా దుబాయ్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. అబుదాబిలో తొలి హిందూ దేవాలయ నిర్మాణానికి దుబాయ్‌ రాజు అనుమతి ఇవ్వటం ప్రశంసనీయమని కొనియాడారు. ప్రవాస భారతీయుల కృషి అభినందనీయమని అన్నారు. దుబాయ్‌లో హిందూ దేవాలయం నిర్మిస్తున్నందుకు 125 కోట్ల భారతీయుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మోదీ చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో దేశం మెరుగైన స్థానంలో ఉందని, దేశాభివృద్ధికి ఎన్నో సవాళ్లను అధిగమించి ముందుకెళ్తున్నామని మోదీ పేర్కొన్నారు.

Related Posts