
- ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు
- కోదండరామ్ సురక్షితం
తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. నల్లగొండ పట్టణంలో ఒక కార్యక్రమానికి హాజరై హైదరాబాద్ తిరుగొస్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొని డివైడర్ మీదకు వెళ్లడంతో కారు ముందుభాగం దెబ్బతింది. బైకుపై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చిట్యాల మండలం వెలిమనేడు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.కోదండరామ్ సురక్షితంగా ఉన్నట్టు టీజేఏసీ అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డి తెలిపారు. ప్రమాద సమయంలో బెలూన్ తెరుచుకోవడంతో కారు లోపల ఉన్నవారు క్షేమంగా బయటపడ్డారు. పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంతో విజయవాడ హైవేపై కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను నియంత్రించారు. కోదండరామ్ మరో వాహనంలో హైదరాబాద్ వెళ్లిపోయారు.