YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఏపీలో రంగంలోకి వెంకయ్య నాయుడు..

ఏపీలో రంగంలోకి వెంకయ్య నాయుడు..

- టీడీపీ ఆ చర్య, బీజేపీ ఆగ్రహం

ఏపీకి ఎన్నో నిధులు ఇచ్చామని బీజేపీ చెప్పడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇచ్చింది చాలా తక్కువ అని, ప్రచారం చేస్తోంది మాత్రం చాలా ఉందని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు అంశాల వారీగా లెక్కలతో వర్కింగ్ పేపర్ తయారు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు నిమగ్నం అయ్యాయి. ఏపీకి అరకొరగా నిధులు ఇచ్చిన కేంద్రం, ఇప్పటికే చాలా ఎక్కువ నిధులు ఇచ్చామన్న ధోరణితో ఉందని అంటున్నారు. ఈ మేరకు బీజేపీకి కౌంటర్ ఇచ్చేందుకు టిడిపి సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే.శుక్రవారం తీసుకున్న నిర్ణయాలు సానుకూలమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి సమక్షంలో అమిత్ షా, అరుణ్ జైట్లీ, ఇతర నేతల మధ్య శుక్రవారం నాటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు సానుకూలంగా ఉన్నాయనే భావన అంతర్గతంగా వ్యక్తమవుతోంది. అయితే గతంలోనూ ఇలాంటి సంకేతాలిచ్చినా సరైన రీతిలో ఆచరణలోకి రాలేదంటున్నారు. కొన్ని విషయాల్లో ప్రకటనలు వచ్చినా ఆచరణలోకి రాలేదని, మరికొన్ని అమలు చేసినా పూర్తి స్థాయిలో దాని ఫలాలొచ్చేలా చర్యలు తీసుకోలేదని, నిధులు కేటాయించాల్సిన వాటి విషయంలో సరైన స్పందన లేదని చంద్రబాబు భావిస్తున్నారు.
టీడీపీ చర్యతో బీజేపీ ఆగ్రహం మిత్రపక్షంగా ఉంటూనే కేంద్రం వైఖరికి నిరసనగా పార్లమెంటు లోపల, బయటా టీడీపీ నిరసన వ్యక్తం చేయటం బీజేపీ అగ్రనేతలకు రుచించలేదు. ఏపీలో విపక్షం ఇచ్చిన బంద్‌ పిలుపునకు కొంత సానుకూలత తెలిపినట్లుగా టీడీపీ వ్యవహరించటమూ వారికి ఇబ్బందికరంగా పరిణమించింది. ఇవన్నీ జాతీయ స్థాయిలోనూ అందరి దృష్టినీ ఆకర్షించాయి.

స్వయంగా రంగంలోకి దిగిన వెంకయ్య ఇదిలా ఉండగా ఎంపీల ఆందోళనకు తోడు వెంకయ్య నాయుడు జోక్యంతో కేంద్రం కదిలిందని తెలుస్తోంది. మిత్రపక్షాల మధ్య ప్రతిష్టంభనకు ఆయన నడుం బిగించారు. ఘర్షణ వాతావరణం మంచిది కాదని చెప్పి.. ఏపీ అంశాలను ఒక కొలిక్కి తేవాలన్న ఉద్దేశ్యంతో చొరవ చూపారని తెలుస్తోంది. వెంకయ్య స్వయంగా జైట్లీ, షాలను తన వద్దకు పిలిచి, సుజనాను కూడా పిలిచి మాట్లాడారు. అనుమానాలు ఉంటే పరస్పరం కలిసి మాట్లాడుకోవాలన్నారు. ఏపీకి ఇవ్వాల్సిన అంశాలపై తాను ప్రధాని మోడీకి చెప్పానని, ఆయన సానుకూలంగా స్పందించారని అమిత్ షా చెప్పారని తెలుస్తోంది.

Related Posts