
మహాశివరాత్రిని పురస్కరించుకొని గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల మధ్య ప్రేమ, ఆప్యాయత, సోదరభావాలను ఈ పండుగ పెంపొందిస్తుందని ఆశిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించేలా భగవంతుడు దీవించాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.