
జలం-జీవం కార్యక్రమంపై మంత్రి కేటీఆర్ సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..హైదరాబాద్ రెయిన్ వాటర్ హర్వేస్టింగ్ పార్కు ఏర్పాటు చేయాలన్నారు. జలం-జీవం కార్యక్రమానికి విస్తృమైన ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇంకుడు గుంతలపై ప్రతిఒక్కరినీ చైతన్య పరచాలన్నారు. ప్రతి ప్రభుత్వ విద్యాసంస్థ, కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా టీ-సాట్ ద్వారా పిల్లలకు ఇంకుడుగుంతలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.