YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

మార్చిలో జియోఫైబర్‌ లాంచింగ్‌..

మార్చిలో జియోఫైబర్‌  లాంచింగ్‌..

ముఖేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో ఎట్టకేలకు అతి తక్కువ ధర కలిగిన ఫైబర్‌ బ్రాడుబ్యాండ్‌ నెట్‌వర్క్‌ జియోఫైబర్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. మార్చి చివరిలో దీన్ని లాంచ్‌ చేయాలని భావిస్తున్నట్టు తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. 2017 చివరిలోనే జియోఫైబర్‌ మార్కెట్‌లోకి వస్తుందని పలు రూమర్లు చక్కర్లు కొట్టాయి. కానీ అవి జరుగలేదు. తాజా రిపోర్టుల ప్రకారం వచ్చే నెలలో కంపెనీ అధికారికంగా జియోఫైబర్‌ను లాంచ్‌ చేస్తుందని తెలుస్తోంది. జియోఫైబర్‌ను ప్రస్తుతం రిలయన్స్‌ జియో 10 నగరాల్లో టెస్ట్‌ చేస్తోంది. లాంచింగ్‌ సమయంలో ఆరు నగరాలు ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, అహ్మదాబాద్‌, జమ్నగర్‌, సూరత్‌, వడోదరాలలో అందుబాటులోకి తీసుకొస్తామని జియోకేర్‌ ట్విట్టర్‌ ద్వారా ధృవీకరించింది. 

అంతకముందు విడుదలైన రిపోర్టుల ప్రకారం జియోఫైబర్‌  ప్లాన్లు రూ.500 నుంచి ప్రారంభమవుతాయని తెలిసింది. రూ.500కు 600జీబీ డేటాను కంపెనీ ఆఫర్‌ చేయనున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. హైయర్‌ ప్యాకేజీలు నెలకు రూ.2000 నుంచి ప్రారంభమవుతాయి. ఈ ప్యాకేజీల కింద 1000 జీబీ డేటాను 100ఎంబీపీఎస్‌ స్పీడులో అందించనున్నట్టు తెలుస్తోంది. జియోమీడియా షేర్‌ డివైజ్‌, స్మార్ట్‌ సెటాప్‌ బాక్స్‌, రూటర్స్‌, పవర్‌ లైన్‌ కమ్యూనికేషన్‌ ప్లగ్స్‌తో జియోఫైబర్‌ సర్వీసులు మార్కెట్‌లోకి రానున్నాయి. హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సర్వీసులతో పాటు ఇంటర్నట్‌ ఆఫ్‌ థింగ్స్‌ను జియోఫైబర్‌ మరింత వ్యాప్తిచేయనుంది.

Related Posts