YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గెలుపుపై కేటీఆర్ ముద్ర

గెలుపుపై కేటీఆర్  ముద్ర
 రాజకీయాల్లోనైనా, సినిమాల్లోనైనా వారసత్వం కేవలం ఎంట్రీవరకే పనికొస్తాయి. ఒక్కసారి బరిలోకి దిగాక ఎవరి టాలెంట్ వాళ్లు చూపించాల్సిందే. సత్తా ఉన్నవాళ్లు సక్సెస్ అవుతారు. లేనివాళ్లు ఫేడవుట్ అవుతారు. ఇది ఎన్నోసార్లు రుజువైంది కూడా. తండ్రిని మించిన కొడుకులు అనిపించుకోవడం కొందరికే సాధ్యమవుతుంది. అలాంటివారిలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయుడు కేటీఆర్ అగ్రస్థానంలో ఉన్నారు. కేసీఆర్ తనయుడిగా తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కేటీఆర్ .. తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన కేటీఆర్.. ఇప్పుడు బంగారు తెలంగాణ సాధనలో కూడా తనదైన పాత్ర పోషిస్తున్నారు. తన మార్క్ రాజకీయాలతో సీనియర్ రాజకీయనాయకులనే ఖంగు తినిపిస్తున్నారు. కేటీఆర్ ప్రస్థానంపై స్పెషల్ రిపోర్ట్. రాజకీయాల్లో వారసత్వాలు ప్లాట్ ఫామ్ ను మాత్రమే క్రియేట్ చేయగలవు.. కానీ భవిష్యత్తు రాజకీయాన్ని నిర్ణయించలేవు. ఒక్కసారి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించాక.. మాట తీరు దగ్గరి నుంచి వ్యవహార శైలి వరకు ప్రతీ విషయాన్ని జనం గమనిస్తారు. ఆకట్టుకునే మాటతీరు, అందరినీ మెప్పించే పనితనం, ముందుచూపుతో కూడిన ప్రణాళికలు ఆయా నేతలకు మాస్ ఇమేజ్ ను క్రియేట్ చేస్తాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలతో దూసుకెళ్తున్న కేటీఆర్ ఇదే పంథాను ఫాలో అవుతున్నారు. కేటీఆర్ రాజకీయ ప్రవేశం వారసత్వంగానే జరిగినా.. ప్రజల్లో తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరుచుకుని, తనదైన మార్క్ రాజకీయాలతో సాగిపోతున్నారు కేటీఆర్.  ఉన్నత విద్యావంతుడు, ట్రబుల్ షూటర్ ..సోషల్ మీడియాలో యాక్టివ్, యూత్ ఐకాన్, ట్రెండీ పొలిటిషియన్.. ఇవన్నీ ఒకరే. ఆయనే కల్వకుంట్ల తారక రామారావు. తెలంగాణ ఉద్యమకర్తగా .. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తనవంతు పాత్ర పోషించిన కేటీఆర్ .. రెండోసారి జరిగిన ఎన్నికల్లోనూ కీరోల్ ప్లే చేశారు. వ్యూహకర్తగా, ప్రచాకర్తగా తన కర్తవ్యాలను నెరవేర్చి టీఆర్ఎస్ కు మళ్లీ అధికారం దక్కేలా చేయడంలోనూ సక్సెస్ అయ్యారు. వరుస విజయాలను సొంతం చేసుకుంటూ ప్రజానేతగా గుర్తింపు తెచ్చుకున్నారు కేటీఆర్. తండ్రి గుణాలను పుణికిపుచ్చుకున్న కేటీఆర్ .. సొంత టాలెంట్ తోనే రాజకీయాల్లో దూసుకెళ్లారు. ప్రజలతో మమేకమవడం.. , ప్రతిపక్షాలపై పంచ్ లు విసిరే నేర్పరితనం.. ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. విషయ పరిజ్ఞానం... తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలపై పట్టు... ఆపిల్ సీఈవో టీమ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటించిన సందర్భంలో ఆయన మాట్లాడిన తీరుకు ప్రశంసలు లభించాయి. పలు అంతర్జాతీయ సంస్థల నుంచి ఆయనకు ఆహ్వానాలు అందాయి. కేటీఆర్ 2వ తరగతి వరకు కరీంనగర్ లోనే చదివారు. 3వ తరగతిలో ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబం హైదరాబాద్ కు మారింది. గుంటూరు విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివిన కేటీఆర్ నిజాం కాలేజీలో బీఎస్సీ మైక్రోబయాలజీ, పుణె యూనివర్సిటీ నుంచి బయోటెక్నాలజీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. అనంతరం న్యూయార్క్ సిటీ యూనివర్సిటీ నుంచి మార్కెటింగ్, ఈ-కామర్స్ లో ఎంబీఏ చదివిన ఆయన అమెరికాలోనే ఉద్యోగ జీవితం సాగించారు. 2006లో కేటీఆర్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తొలిసారి 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు కేటీఆర్. ఆ తర్వాత అదే నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు. ప్రభుత్వం, పార్టీలోనూ కీలకంగా వ్యవహరిస్తూ నాయకుడిగా ఎదిగారు. కొత్త రాష్ట్రం తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రి పదవి చేపట్టారు. ఐటీ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌, టెక్సైల్స్‌ , ఎన్నారై ఎఫైర్స్‌ మంత్రిగా కేటీఆర్ పనిచేశారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రజలతో ఇంటరాక్ట్ అవుతుంటారు. ట్విటర్ వేదికగా తన దృష్టికొచ్చే సమస్యలను పరిష్కరించిన సందర్భాలున్నాయి. మనదేశంలో సినీ నటులకు ఉండేంత క్రేజ్, ఫాలోయింగ్ రాజకీయనాయకులకు అస్సలు ఉండదు. అయితే ఈ విషయంలో మాత్రం కేటీఆర్ ఒక్కడికి మాత్రం మినహాయింపు ఇవ్వాల్సిందే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని నడిపిన కేసీఆర్ వారసుడిగా కంటే, సోషల్ మీడియా ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకుంటూ, వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపించే నాయకుడిగానే కేటీఆర్‌కు ఫాలోయింగ్ ఎక్కువ. యూత్‌లోనూ ఆయనకి ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. సూపర్‌స్టార్ మహేష్‌బాబు వంటి వాళ్లు కూడా ట్విట్టర్లో కేటీఆర్‌ను ఫాలో అవుతారంటే, కేటీఆర్ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. 

Related Posts