YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మట్టి కరిచిన సీనియర్లు

మట్టి కరిచిన సీనియర్లు
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ‘కారు’ ప్రభంజనం సృష్టించగా.. కీలక మంత్రలు ఓటమి పాలయ్యారు. అటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మహామహులు, మాజీ మంత్రులు కూడా ఓటమి చవిచూశారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అలాగే, నాగర్‌కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. తాండూరు నియోజకవర్గం నుంచి మంత్రి మహేందర్ రెడ్డి, ములుగులో మరో మంత్రి చందూలాల్ ఓటమి పాలయ్యారు. ఇక భూపాలపల్లి నియోజకవర్గం నుంచి స్పీకర్ మధుసూదనాచారి పరాజయం చెందారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకట్రామారెడ్డి గెలుపొందారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది సీనియర్ నేతలు ఓటమి చవిచూశారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు రేవంత్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి, కొండా సురేఖ, షబ్బీర్ అలీ, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డీకే అరుణ ఓటమి పాలయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆసక్తి రేపిన కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. కొడంగల్‌ నుంచి బరిలో ఉన్న ఫైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డి ఓడిపోయారు. టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి చేతిలో రేవంత్ ఓటమి చవిచూశారు. అలాగే, జనగామ నియోజకవర్గం నుంచి పోటీచేసిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య.. టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేతిలో ఓడిపోయారు. 
తెలంగాణ ఎన్నికల్లో ఓటమిపాలైన మహామహులు.. పార్టీల వారీగా వివరాలు
టీఆర్ఎస్ 
తుమ్మల నాగేశ్వరరావు (పాలేరు) - ప్రత్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి (కాంగ్రెస్) 
జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్) - ప్రత్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి (కాంగ్రెస్) 
మహేందర్‌రెడ్డి (తాండూరు) - ప్రత్యర్థి రోహిత్ రెడ్డి (కాంగ్రెస్) 
అజ్మీరా చందూలాల్‌ (ములుగు) - ప్రత్యర్థి డి.అనసూయ అలియాస్ సీతక్క (కాంగ్రెస్) 
సిరికొండ మధుసూదనాచారి (భూపాలపల్లి) - ప్రత్యర్థి గండ్ర వెంకటరమణా రెడ్డి (కాంగ్రెస్) 
కాంగ్రెస్ 
రేవంత్ రెడ్డి (కొడంగల్) - ప్రత్యర్థి పట్నం నరేందర్ రెడ్డి (టీఆర్ఎస్) 
కె.జానారెడ్డి (నాగార్జునసాగర్) - ప్రత్యర్థి నోముల నర్సింహయ్య (టీఆర్ఎస్) 
డీకే అరుణ (గద్వాల) - ప్రత్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (టీఆర్ఎస్) 
జీవన్ రెడ్డి (జగిత్యాల) - ప్రత్యర్థి సంజయ్ కుమార్ (టీఆర్ఎస్) 
పొన్నాల లక్ష్మయ్య (జనగామ) - ప్రత్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (టీఆర్ఎస్) 
పొన్నం ప్రభాకర్ (కరీంనగర్) - ప్రత్యర్థి గంగుల కమలాకర్ (టీఆర్ఎస్) 
కొండా సురేఖ (పరకాల) - ప్రత్యర్థి చల్లా ధర్మారెడ్డి (టీఆర్ఎస్) 
షబ్బీర్ అలీ (కామారెడ్డి) - ప్రత్యర్థి గంప గోవర్ధన్ రెడ్డి (టీఆర్ఎస్) 
దామోదర రాజనరసింహ (ఆంధోలు) - ప్రత్యర్థి చంటి క్రాంతికిరణ్ (టీఆర్ఎస్) 
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (నల్గొండ) - ప్రత్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి (టీఆర్ఎస్) 
బీజేపీ 
డాక్టర్ కె.లక్ష్మణ్ (ముషీరాబాద్) - ప్రత్యర్థి ముఠా గోపాల్ (టీఆర్ఎస్) 
జి.కిషన్‌రెడ్డి (అంబర్‌పేట) - ప్రత్యర్థి కాలేరు వెంకటేశ్ (టీఆర్ఎస్) 
చింతల రామచంద్రారెడ్డి (ఖైరతాబాద్) - ప్రత్యర్థి దానం నాగేందర్ 
టీడీపీ 
నామా నాగేశ్వరరావు (ఖమ్మం) - ప్రత్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ (టీఆర్ఎస్) 
నందమూరి సుహాసిని (కూకట్ పల్లి) - మాధవరం కృష్ణారావు (టీఆర్ఎస్

Related Posts