YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఐదు జిల్లాల్లో ఎదురు లేని టీఆర్ఎస్

ఐదు జిల్లాల్లో ఎదురు లేని టీఆర్ఎస్
తెలంగాణలో  సస్పెన్స్ కు తెరపడింది. నరాల తెగే ఉత్కంఠ మధ్య ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి.  కేసీఆర్‌ దూకుడు ముందు ప్రతిపక్షాలు కకావికలమైపోయాయి. నాలుగు పార్టీలు  కలిసి ఏర్పాటు చేసిన ప్రజాకూటమి కూడా టీఆర్ ఎస్ విజయాన్ని నిలువరించలేక చతికలపడింది. సరైన వ్యూహం లేకుండా ఎన్నికల్లోకి వెళ్లడం కూడా కూటమి వైఫల్యానికి కారణమైంది. బలమైన ఓటు బ్యాంక్‌ ఉన్న కాంగ్రెస్‌, తెదేపాల మధ్య ఓట్ల బదలాయింపులో ఉన్న లోపాలను ఈ ఫలితాలు బయటపెట్టాయి. వేగం, సమన్వయం విజయవకాశాలను శాసిస్తాయని ఈ ఎన్నికల తీర్పుతో ప్రతిపక్షాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.119  సీట్లలో 87 సీట్లను గెలుచుకుని టీఆర్ఎస్ అధికారాన్ని నిలబెట్టకుంది.  అంచనాలను తలక్రిందు చేస్తూ మహాకూటమి 22 సీట్లకే పరిమితమయ్యింది. ఎంఐఎం 7 సీట్లను  గెలుచుకోగా ,బీజేపీ ఒక్క సీటును, ఇండిపెండెంట్లు 2 సీట్లను గెలుచుకున్నారు.తెలంగాణ ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ పార్టీ కి  46.7 శాతం ఓట్లు తో 87 సీట్ల లభించగా,మహాకూటమికి  33.56 శాతం  ఓట్లతో 22 సీట్లను కైవసం చేసుకుంది. ఎంఐఎం 7 శాతం ఓట్లతో 7  సీట్లను గెలుచుకోగా, కమలం 6.60 శాతం ఓట్లతో  ఒక్క సీటుతో సరిపెట్టుకుంది.ఇండిపెండెంట్లు 6.12 శాతం ఓట్లతో 2 సీట్లను దక్కించుకున్నారు.టీఆర్ఎస్ ఓట్ల శాతం గణనీయంగా పెరింగి. ఆ పార్టీ 47.4 శాతం ఓట్లతో 86 సీట్లను దక్కించుకుంది. అదే సమయంలో టీడీపీకి ఓట్ల శాతం సగానికి పైగా పడిపోతాయని, 2014లో ఆ పార్టీకి 14.70 శాతం ఓట్లు రాగా ఇప్పుడు 5.66 శాతం ఓట్లే వస్తాయని, కేవలం 2 చోట్ల మాత్రమే విజయం సాధిస్తుందని పేర్కొంది. ఆ పార్టీ ఓట్ల శాతం 9.04 శాతం మేర తగ్గుతుందని చెప్పినా అంతకంటే ఎక్కువ మొత్తమే టీడీపీ చేజార్చుకుంది. ఇప్పుడు ఆ పార్టీకి కేవలం 3.1 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి.తెలంగాణ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెల్లడయ్యాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ‘కారు’ ప్రభంజనం సృష్టించగా.. కీలక మంత్రలు ఓటమి పాలయ్యారు. అటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మహామహులు, మాజీ మంత్రులు కూడా ఓటమి చవిచూశారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలకుగానూ 8 టీఆర్ఎస్ చేజిక్కించుకోగా 2 స్ధానాలతో కాంగ్రెస్ సరిపెట్టుకుంది. హైదరాబాద్ జిల్లాలోని 15 స్ధానాలను టీఆర్ఎస్ 8, ఎంఐఎం 7, బీజేపీ ఒక స్ధానాన్ని కైవసం చేసుకోగా కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా దక్కలేదు.కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాలలో 11 టీఆర్ఎస్ కైవసం చేసుకోగా, మరో 2 స్దానాలు కాంగ్రస్ గెలుచుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 స్ధానాలలో 8 కాంగ్రెస్ గెలుచుకోగా, టీఆర్ఎస్, ఇండిపెండెంట్లు చెరొక సీట్ దక్కించుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం టీఆర్ఎస్‌కు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. 2014 ఎన్నికల్లాగే.. ఈసారి కూడా ఆ పార్టీ కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆంధ్రాకు పొరుగున ఉన్న ఈ జిల్లాలో అధికార టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. కేసీఆర్, కేటీఆర్‌లు ప్రచారం నిర్వహించినా ఉపయోగం లేకుండా పోయింది. గత ఎన్నికల్లో అంతగా సత్తా చాటలేకపోయిన మిగతా జిల్లాల్లో ఈసారి టీఆర్ఎస్‌ బలం పెంచుకుంది. కానీ ఖమ్మంలో మాత్రం కేసీఆర్ పాచికలు పారలేదు. మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 9 టీఆర్ఎస్, ఒక సీట్ కాంగ్రెస్ దక్కించుకున్నాయి. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో 14 స్ధానాలకుగానూ 13 స్ధానాల్లో టీఆర్ఎస్ గెలుపొందగా మరో స్ధానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 8 టీఆర్ఎస్, 4 కాంగ్రెస్ గెలుచుకున్నాయి. నిజామాబాద్ 9 స్ధానాల్లో 8 టీఆర్ఎస్ కైవసం చేసుకోగా మరో స్ధానాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 స్ధానాలలో టీఆర్ఎస్ 10 స్ధానాలు గెలుపొందగా మరో 2 స్ధానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక రంగారెడ్డి జిల్లాలోని 14 స్ధానాల్లో 11 స్ధానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకోగా 3 స్ధానాలతో కాంగ్రెస్ సరిపెట్టుకుంది. మొత్తానికి కే సీఆర్‌ దూకుడు ముందు ప్రతిపక్షాలు కకావికలమైపోయాయి. కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు కలిసి ఏర్పాటు చేసిన ప్రజాకూటమి కూడా టీఆర్ ఎస్ విజయాన్ని నిలువరించలేక చతికలపడింది. సరైన వ్యూహం లేకుండా ఎన్నికల్లోకి వెళ్లడం కూడా కూటమి వైఫల్యానికి కారణమైంది. బలమైన ఓటు బ్యాంక్‌ ఉన్న కాంగ్రెస్‌, తెదేపాల మధ్య ఓట్ల బదలాయింపులో ఉన్న లోపాలను ఈ ఫలితాలు బయటపెట్టాయి. వేగం, సమన్వయం విజయవకాశాలను శాసిస్తాయని ఈ ఎన్నికల తీర్పుతో ప్రతిపక్షాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది

Related Posts