YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జనం మెచ్చిన నేత

జనం మెచ్చిన నేత
 ఒకే ఒక్కడు. టీఆర్ఎస్ కు ప్రాణం. ఆయన తప్పించి ఈ పార్టీలో గుర్తుపట్టగల నేత ఎవరున్నారు? అంటూ ప్రతిపక్షం కేసీఆర్ గురించి అనేక విమర్శలు చేసింది. ఈ దఫా టీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయమని జోస్యం చెప్పింది. అయితే విపక్షం అంచనాలు.. ఆశలు గల్లంతైపోయాయి. ఎవర్నైతే తీవ్రంగా ఈసడించి.. దుమ్మెత్తిపోశారో ఆయనే తెలంగాణ ఎన్నికల్లో దుమ్మురేపారు. విపక్షాలను మట్టికరిపించి పై చేయి సాధించారు. మామూలుగా కాదు.. ప్రభంజనమే సృష్టించారు. తన రాజకీయ చాణక్యంతో ప్రతిపక్షాన్ని పిండి చేసేశారు. టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు. ఎలక్షన్ రిజల్ట్ తీరు చూస్తే.. కారు.. ఫార్ములా రేస్ లో దూసుకెళ్లే కార్స్ నే తలపించింది. అంతకంటే ఎక్కువ జోరే చూపించిందని చెప్పొచ్చు. ఇదంతా కేసీఆర్ వ్యూహాల ఫలితమే. ప్రజాఫ్రంట్ ఏర్పడినప్పుడు అధికార పార్టీ అధినేత కేసీఆర్.. ఒక బక్కోడిని కొట్టడానికి ఇంత మంది వచ్చారు. ప్రజలే వారికి బుద్ధి చెప్తారన్నట్లు మాట్లాడారు. ఆయన చెప్పినట్లే జరిగింది. తెలంగాణ సమాజం కూటమిని సంపూర్తిగా తిరస్కరించింది. మొత్తంగా తెలంగాణ తొలి ఎన్నికల్లో.. కేసీఆర్ కోహినూర్ డైమండ్ లా వెలిగిపోయారు. తిరుగులేని ఆధిక్యంతో.. రాష్ట్ర పగ్గాలు తనవద్దే ఉంచుకున్నారు. 
ఉద్యమ నేతగా కేసీఆర్ దూకుడు ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ముఖ్యమంత్రిగానూ ఆయన ఫాస్ట్ ట్రాక్ లోనే ఉన్నారు. ఇక సెప్టెంబర్ లో ఎన్నికల ప్రకటన.. అనంతరం సాగిన ప్రచారహోరు.. మొత్తంగా కేసీఆర్ నాయకత్వ పటిమకు నిదర్శనాలే. తమ పార్టీని ప్రజలకు చేరువ చేయడంలో ఆయన అమోఘమైన ప్రతిభ చూపారు. టీఆర్ఎస్ కు తెలంగాణ సమాజం దూరమైంది అనుకున్న ప్రతిపక్షాన్ని ఈ ఎన్నికల ఫలితాలతో నివ్వెరపరిచారు. అంతేనా.. విపక్షాన్ని ఇప్పట్లో తేరుకోలేని విధంగా దెబ్బతీశారు. ప్రధాన ప్రతిపక్షంలో పేరున్న నేతలే ఓటమి చవిచూశారంటే.. కేసీఆర్ పక్కా ప్రణాళిక వల్లే. సాధారణ ఎన్నికలకు 9 నెలల సమయం ఉన్నా.. జనాకర్షక పథకాలపై నమ్మకంతో బరిలోకి దిగి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు కేసీఆర్.  దేశంలోనే ముందస్తుకు వెళ్లి గెలిచిన నేతగా కేసీఆర్‌ చరిత్రకెక్కారు.గతంలో ముందస్తుకు వెళ్లిన అన్ని ప్రభుత్వాలు ఎన్నికల్లో చతికిలబడగా.. టీఆర్‌ఎస్‌ మాత్రం విజయంతో గత చరిత్రను తిరగరాసింది. నిజానికి, ఉమ్మడి ఏపీలో మూడుసార్లు జరిగిన ముందస్తుల్లోనూ అధికార పార్టీ ఓటమి చవిచూసింది. తెలంగాణ ఎన్నికల ఫలితం కేసీఆర్ పనితీరుకు దర్పణం. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్ర ప్రజానీకం ప్రతిష్టాత్మక తీర్పు. ఇంతటి ఘన విజయం సొంతం చేసుకున్న టీఆర్ఎస్ కు, పార్టీకి విజయం కట్టబెట్టేందుకు సర్వశక్తులూ ఒడ్డిన.. ఒన్ మ్యాన్ ఆర్మీ.. ముఖ్యమంత్రి కేసీఆర్.   

Related Posts