YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హరీష్ రావు గ్రౌండ్ వర్క్.. బేస్ కొల్పోయిన రేవంత్

హరీష్ రావు గ్రౌండ్ వర్క్.. బేస్ కొల్పోయిన రేవంత్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఫైర్ బ్రాండ్, కొడంగల్ తన అడ్డా అని చెప్పుకునే టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ ఎనుముల రేవంత్ రెడ్డి ఎవరూ ఊహించని విధంగా ఓటమి పాలయ్యారు. ఆయనపై టీఆర్ఎస్ అభ్యర్థ పట్నం నరేందర్ రెడ్డి 17 వేలకు పైగా ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. దీంతో రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులకు షాక్ తగిలినట్లయ్యింది. ఇంత భారీ మెజారిటీతో గెలుస్తానని కనీసం టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కూడా ఊహించి ఉండరు. అయితే, రేవంత్ రెడ్డిపై గెలుపు టీఆర్ఎస్ కు అంత సులువుగా దక్కలేదు. గత సంవత్సర కాలంగా టీఆర్ఎస్ చేస్తున్న గ్రౌండ్ వర్క్ తోనే ఆ పార్టీ విజయం సాధించగలిగింది.అప్పటినుంచే నియోజకవర్గంలో టీఆర్ఎస్ ను బలోపేతం చేశారు. ఇతర పార్టీ నుంచి, కాంగ్రెస్ నుంచి, చివరకు రేవంత్ రెడ్డి వర్గం నుంచి కూడా పెద్దఎత్తున ద్వితీయ శ్రేణి నాయకులకు గులాబీ కండువాలు కప్పారు. అదే సమయంలో ఇంతకాలం తీవ్ర వెనుకబాటుకు గురైన కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అయితే, తనవల్లే అభివృద్ధి పనులు జరిగినట్లు రేవంత్ రెడ్డి చెప్పినా… టీఆర్ఎస్ వల్లె జరిగాయని నమ్మినట్లు ఎన్నికల ఫలితాలు చూస్తే స్పష్టమవుతోంది. ఇక, మూడు నెలలుగా నరేందర్ రెడ్డి, సీనియర్ నేత గురునాధ్ రెడ్డి నియోజకవర్గంలో తీవ్రంగా కష్టపడ్డారు. బాగా ప్రచారం నిర్వహించారు. పోల్ మేనేజ్ మెంట్ కూడా బాగా చేసుకున్నారు. అదే సమయంలో రాష్ట్ర నేతగా మారిన రేవంత్ రెడ్డి రాష్ట్రం మొత్తం ప్రచారం చేయాల్సి వచ్చింది. దీంతో నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయారు. ఇక ఎన్నికల సమయంలో అర్థరాత్రి అరెస్టు, ఐటీ సోదాలు రేవంత్ రెడ్డికి సానుభూతి తెచ్చునట్లు కనిపించడం లేదు. మొత్తానికి రేవంత్ టార్గెట్ గా టీఆర్ఎస్ వేసిన స్కెచ్ సూపర్ హిట్ అయ్యింది. కొడంగల్ నుంచి టీడీపీ తరపున రేవంత్ రెడ్డి రెండుసార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి గురునాథ్ రెడ్డిని ఓడించారు. స్థానికేతరుడే అయినా నియోజకవర్గంలో బలమైన నేతగా రేవంత్ రెడ్డి ఎదిగారు. ఇక రాష్ట్రస్థాయిలోనూ కీలకంగా రేవంత్ రెడ్డి మారారు. టీఆర్ఎస్ ను, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ గా చేసుకుని రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో టీఆర్ఎస్ కూడా ఆయనను టార్గెట్ చేసుకుంది. గత సంవత్సరం రేవంత్ కాంగ్రెస్ లో చేరడంతో అప్పుడే ఉప ఎన్నికలు వస్తాయని భావించిన టీఆర్ఎస్ గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. రేవంత్ కు నరేందర్ రెడ్డి రూపంలో బలమైన ప్రత్యర్థిని నిలబెట్టింది. టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన హరీష్ రావు కొడంగల్ బాధ్యతలు తీసుకున్నారు.

Related Posts