YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలి పార్లమెంట్‌ ఆవరణలో తెదేపా ఎంపీల ఆందోళన

విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలి           పార్లమెంట్‌ ఆవరణలో తెదేపా ఎంపీల ఆందోళన
పార్లమెంట్‌ శీతకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఏపీకి చెందిన తెదేపా ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఎంపీలు అశోక్‌ గజపతి రాజు, టీజీ వెంకటేశ్‌, మురళీ మోహన్‌, శివప్రసాద్‌, కనకమేడల రవీంద్ర కుమార్‌, కొనకళ్ల నారాయణ, గల్లా జయదేవ్‌ ఈ ఆందోళనలో పాల్గొన్నారు.మరోవైపు శ్రీకాకుళంపై విరుచుకుపడిన తిత్లీ తుపాను విషయంలో కేంద్ర సాయంపై చర్చించాలంటూ రూల్ 377 కింద శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు నోటీసు ఇచ్చారు. తుపాను వల్ల రూ. 3,435 కోట్ల మేర నష్టం వాటిల్లితే కేవలం రూ.539.52 కోట్ల సాయం కేంద్రం విడుదల చేయడంపై ఏపీ ప్రభుత్వం అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.

Related Posts