YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

ఆందోళనకు గురి చేస్తున్నబాలికల అదృశ్యం కేసులు

 ఆందోళనకు గురి చేస్తున్నబాలికల అదృశ్యం కేసులు
ఆడాంబరంగా తమ ఆడపిళ్లలకు పెళ్లిళ్లు చేద్దాం అనుకుంటున్న తల్లిదండ్రుల ఆశలు నిరాశలు చేస్తున్నారు. కొంత మంది అమ్మాయిలు కడుపుల్లో పుట్టిన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచిన పెద్దలకు కనీసం పేగు మమకారాన్ని సైతం లెక్కచేయకుండా రెక్కలోచ్చిన పక్షిలాగా ఎగిరిపోతున్నారు. ఇంట్లో వారికి చెప్పకుండా వెళ్లిపోతూ కనీళ్లు మిగిలిస్తున్న బాలికల అదృశ్యం కేసులు నగర శివారు పోలీసులను తలలు పట్టుకునేలా చేస్తున్నాయి. పలు పోలీసు స్టేషన్లో రోజుకు 5 నుంచి6 కేసులు నమోదు అవుతున్నాయంటే అదృశ్యం కేసుల తీవ్రత పెరిగిందని పోలీసులు భావిస్తున్న ఈ సమస్యకు ఎలా అడ్డుకట్టవేయాలో తెలియడం లేదంటున్నారు. పలువురు అధికారులు, కొన్ని సందర్భాలలో కేవలం సెల్‌ఫోన్ల వలనే ఈ ఘటనలు పెరుగుతున్నాయని భావిస్తున్న పోలీసు అధికారులు టీనేజ్‌లో ఉన్న అమ్మాయిలకు అవసరం లేకున్న ఫోన్లు ఇవ్వడం వలనే ఈ పరిస్థ్దితులు దాపురించాయని అధికారులు అంటున్నారు.కళాశాలకు వెళ్తున్న అమ్మాయిలకు అవసరం ఉన్న వారికి మత్రమే సెల్‌పోన్లు తల్లిదండ్రులు ఇప్పించాలని అవసరంలేని వారికి సెల్‌ఫోన్లు నిషేధించాలని పలువురు మేధావులు సూచిస్తున్నారు. కొన్ని కళాశాలలో ఇప్పటికి విద్యార్థులు తమ తరగతి గదిలోకి సెల్‌ఫోన్లు తీసుకువెళ్తున్నారని అలా వదిలేయకుండా సెల్‌ఫోన్లు కళాశాలకు నిషేధిస్తే ప్రేమాయానాలు, మెసెజ్‌లు,వాట్సాప్‌లు ఉండవని అప్పుడు నేరుగా పిల్లలు చదువుపై దృష్టి పెడుతారంటున్నారు పలువురి విశ్లేషకులు భావిస్తున్నారు.సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధి బాలానగర్ డిసిపి జోన్ పరిధిలోని జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, దుండిగల్, పేట్‌బషీరాబాద్, బాలానగర్, మేడ్చల్ పోలీసు స్టేషన్ల పరిధిలో మిస్సింగ్ కేసులు ఇటీవల గత కొంత కాలంగా అధికంగా నమోదు అవుతున్నాయి. రోజుకు ఈ జోన్‌పరిధిలో కనీసం 5 నుంచి 10 ఫిర్యాదులైన తమ దగ్గరలోని పోలీసు స్టేషన్లకు తమ పిల్లలు కనిపించడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు. అధికంగా అదృశ్యమవుతున్నవారిలో ఎక్కువ శాతం 16 నుంచి 22 సంవత్సరాల వయస్సున్నా వారే ఉంటున్నారని , కొంత మంది పెళ్లి చేసుకున్నామని కొందరు చెబుతున్నా , మరికొందరు ఎక్కడా ఉన్నారో తెలియని పరిస్థితులు నెలకోన్నాయి.వాస్తవానికి ఈ ప్రాంతంలో అత్యధికంగా మధ్యతరగతి కుటుంబాల వారు నివాసాలు ఉండంటంతో తల్లిదండ్రులు చదువుకున్నవారు ఉండటం తక్కువే. ఈ సందర్భంలో అత్యధిక శాతం టీనేజ్ అమ్మాయిలు తల్లిదండ్రులు తమ పిల్లలను కళాశాలలకు పంపిస్తే ప్రేమాయణంలో పడి కొందరు క్షణీకావేశానికి లోనే కొందరు తమతో మంచిగా మాట్లాడి నటించిన వారితో వెళ్లిపోతున్నారని పలుకేసులు నిరూపిస్తున్నాయి. ముక్కుమొఖం తెలియని వారితో వెళ్లీపోతూ తమ తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిలిస్తుండటంతో పోలీసులు వాది తల్లిదండ్రుల బాధలకు నచ్చచెప్పలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వృత్తి ధర్మం తప్పా మేము ఏమిచేయలేక పోతున్నామని పోలీసులు వాపోతున్నారు. 

Related Posts