YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మార్కెట్లలలో లాభాలకు బ్రేక్

మార్కెట్లలలో లాభాలకు బ్రేక్
ఏడు సెషన్లపాటు లాభాల్లో పయనించిన స్టాక్ మార్కెట్లు గురువారం (డిసెంబరు 20) నష్టాల్లో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే గురువారం నాటి నష్టాలను కొనసాగిస్తూ వరసగా రెండో రోజైన శుక్రవారం (డిసెంబరు 21) భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు, రూపాయి క్షీణించడం సూచీలపై తీవ్ర ప్రభావం చూపడంతో దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌(ఫెడ్‌) వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. దీంతో పాటు అమెరికా, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఉదయం ట్రేడింగ్ ఆరంభంలో సెన్సెక్స్‌ 18 పాయింట్ల స్వల్ప లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించి.. ఆ తర్వాత తీవ్ర నష్టాల్లోకి జారుకుంది. నిఫ్టీ 10,900 మార్క్‌ వద్ద కొనసాగింది. తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా ఐటీ షేర్లకు భారీగా అమ్మకాల సెగ తాకింది. రియల్ ఎస్టేట్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగాలతో పాటు ప్రైవేట్‌ బ్యాంకుల షేర్లు కూడా భారీగా క్షీణించాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరల పతనం కొనసాగుతూనే ఉంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 689.60 పాయింట్ల నష్టంతో 35,742.07 వద్ద.. నిఫ్టీ 197.70 పాయింట్ల నష్టంతో 10,754 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 45 పైసలు క్షీణించి 70.15 వద్ద కొనసాగుతోంది. రూపాయి విలువ ఓ దశలో ఎన్ఎస్‌ఈలో హెచ్‌పీసీఎల్ (2.29), బీపీసీఎల్ (0.96), కోల్ ఇండియా (0.88), ఎన్టీపీసీ (0.84), హిండాల్కో (0.04), తదితర షేర్లు లాభాల్లో ముగియగా.. ఐవోసీ (-5.48),యూపీఎల్ (-4.46), అదానీపోర్ట్స్ (-3.75), మారుతీ సుజుకీ (-3.47), ఇండియాబుల్స్ హౌసింగ్ (-3.45) షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. 

Related Posts