
నెల్లూరు, జూలై 8,
వేలాది మంది రైతులు.. గొంతెత్తి అరుస్తున్నారు.. రోడ్డెక్కి నినదిస్తున్నారు… దీనంగా మొరపెట్టుకుంటున్నారు.. అయినా ఏలిన వారు స్పందించడం లేదు. దక్షిణ కోస్తా ప్రాంతంలో ఇండోసోల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఓ సోలార్ కంపెనీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం ఇది. తమ పొలాలు పోతున్నాయని.. రైతులు రగిలిపోతుంటే.. ప్రభుత్వం సెలెంట్.. ప్రభుత్వాధినేాతా సైలంట్.. అధికార పార్టీ సెలంట్.. మిత్రపక్షాలు సెలంట్.. ప్రతిపక్షాలూ.. సైలంట్.. టోటల్‌గా ఓ నిశ్శబ్దమే రాజ్యమేలుతోంది..నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని కరేడు గ్రామపంచాయతీ పరిధిలోని ఓ 15 గ్రామాల పరిధిలో షుమారు 4500 ఎకరాల్లో భూసేకరణకు జూన్ 22న నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ భూమి సేకరణ ఎందుకంటే..ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ సంస్థ ఈ ప్రాంతంలో సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారు చేస్తుంది. ఇది దేశంలోనే అతిపెద్ద, ఇంటిగ్రేటెడ్ సోలార్ ప్యానల్స్ తయారీ ప్లాంట్ అని చెబుతున్నారు. 8,000 ఎకరాల్లో 5GW చొప్పున మొత్తం రెండు దశల్లో 10GW సామర్థ్యంతో దీనిని నిర్మించనున్నారు. పరిశ్రమలో సోలార్ సెల్స్, వాఫర్స్, పాలిసిలికాన్, గ్లాస్ ప్యానెల్స్ తయారీతో పాటు అనుబంధ పరిశ్రమలు, టౌన్‌షిప్, ఇతర మౌలిక వసతులు కూడా ఉంటాయి. మొత్తం రూ. 25,000 కోట్ల పెట్టుబడితో 23,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పించే అవకాశం ఉందని కంపెనీ చెబుతోంది.అంతపెద్ద పెట్టుబడితో.. ఇంత పెద్ద పరిశ్రమ వస్తుంటే సంతోషించాలి కానీ... మరి వివాదం ఎందుకు..?ఎందుకంటే. పచ్చని పొలాలతో.. పకృతి రమణీయంగా ఉన్న ఈ ప్రాంతాన్ని పరిశ్రమ కోసం ఎంపికచేయడమే సమస్య..! ఇక్కడ ఉన్న భూమిని తీసుకుని పరిశ్రమకు ఇవ్వడానికి రైతులు ఒప్పుకోవడం లేదు. తమ భూమిని ఇవ్వం అని తెగేసి చెబుతున్నారు. ఎక్కడ పరిశ్రమ ఏర్పాటు అయినా రైతుల నుంచి అభ్యంతరాలు తప్పవు. కాకపోతే.. పంటలు సరిగ్గా పండని బంజరు ప్రాంతాలు, నీటి సౌకర్యం తక్కువ ఉన్న పొలాలను.. వీటికోసం ఎంపిక చేస్తారు. వ్యవసాయం కంటే.. అక్కడ ఉపాధి అవసరం ఎక్కువ ఉన్న భూములు తీసుకుంటారు. కానీ ఇలాంటి సారవంతమైన భూములను తీసుకుంటామనడంతో గొడవ మొదలైంది. రైతులు తమ జీవనాధారం కోల్పోతామని, ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. జూన్ 29 న వీళ్లు జాతీయ రహదారిని దిగ్భందించారు. గ్రామసభల్లో తమ భూములు ఇవ్వమని చెప్పేశారు.మరి ఇంత జరుగుతుంటే.. సంబంధిత మంత్రి… గొట్టిపాటి రవికుమార్ మాట్లాడలేదు. – ఒకప్పుడు ఈ ప్రాంతం ప్రకాశం జిల్లాలోనే ఉండేది ఆయన ఆ జిల్లా మంత్రి కూడా..! డిపార్ట్‌మెంట్ నుంచి మాట్లాడటం లేదు. చిన్న విషయానికి కూడా స్పందించే సీఎం చంద్రబాబు నోరెత్తడం లేదు.. ఆ పార్టీ నేతలు అధికారికంగా స్పందించడం లేదు. ఆ పార్టీ భవిష్యత్ అని చెప్పే నారా లోకేష్ నో రెస్పాన్స్… అన్యాయం జరిగితే నినదిస్తా అని చెప్పే కూటమి మిత్రుడు పవన్ కల్యాణ్ పత్తాలేరు.. బీజేపీ నోరెత్తడం లేదు. ఇలా మొత్తం సర్కారు వారి సైలెన్స్ లా పరిస్థితి ఉంది.ఈ విషయంలో ప్రభుత్వం కు మేలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోందని అందరూ అనుకునేలా వాళ్ల వ్యవహారశైలి ఉంది. కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకోవడానికి ప్రధాన కారణం.. ఈ ప్రాజెక్టును అధికారంలోకి రాకముందు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎలక్షన్‌కు ముందు ఆ పార్టీకి వాయిస్ గా ఉన్న లోకేష్ తన పాదయాత్రలో ఇండోసోల్‌ను కంపెనీ అన్నారు. మరి అప్పటి ఫేక్ కంపెనీ రెండేళ్లలో కంపెనీ అయిపోయిందా అని జనం ప్రశ్నిస్తున్నారు. ఒకసారి లోకేష్ అప్పుడు ఏం చెప్పారో చూడండి..కనీసం లక్ష రూపాయల కేపిటల్ లేనటువంటి.. కంపెనీ 72వేల కోట్ల పెట్టుబడులు పెడుతందా అన్నది ఆయన ప్రశ్న. మరి ఈ రెండేళ్లలో పెట్టుబడులు ఎక్కుడ నుంచి తెచ్చింది ఇండో సోల్ సంస్థ షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ కు చెందిన సబ్సిడరీ కంపెనీ.. ఈ సంస్థకు కిందటి జగన్ మోహనరెడ్డి ప్రభుత్వం ఆయాచిత లబ్ది చేకూర్చిందని తెలుగుదేశం పదే పదే ఆరోపించింది. ట్రాన్స్ ఫార్మర్లలో దోపిడీ చేసిందన్నారు. స్మార్ట్ మీటర్లతో దోచుకున్నారు అని చెప్పారు. అసలు ఆ కంపెనీలో జగన్ బినామీ అని కూడా చెప్పారు. మరి అలాంటి కంపెనీపై అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది.. ఎందుకు విచారణ జరిపించడం లేదు. అది చేయకపోగా.. ఇలా భూములను ఎందుకు కట్టబెడుతున్నారు..పరిశ్రమలు రావడం అవసరమే కానీ.. నిజంగా దానికి అంత భూమి ఎందుకు.. కిందటి ప్రభుత్వం 5వేలు ఎకరాలు ప్రతిపాదిస్తే ఇప్పుడు 8వేల ఎకరాలు ఎందుకు అడుగుతున్నారు...?అంత పెట్టుబడిని ఎక్కడ నుంచి తీసుకొస్తుంది.. వీటికి దేనికీ సమాధానాలు లేవుసహజంగా అధికారపక్షం వైపు తప్పు ఉంటే ప్రతిపక్షం రాజకీయ లబ్ది కోసమైనా దానిని టేకప్ చేస్తుంది. కానీ ఇక్కడ కరేడు వాసులది దీనస్థితి.. తెలుగుదేశం ప్రభుత్వం, పార్టీ అధికారికంగా స్పందించకపోయినా.. ఆ పార్టీ లోకల్ నాయకత్వం, సానుభూతి పరులు వాళ్లకి మద్దతు తెలుపుతున్నారు. కానీ దీనిపై స్పందించాల్సిన మాత్రం పూర్తి సైలంట్. కొంతమంది రౌడీషీటర్లను కొడితేనే పనిగట్టుకుని వెళ్లి పరామర్శించి వచ్చిన జగన్ మోహనరెడ్డికి కనీసం దీనిపై స్పందించడం లేదన్నది వాళ్ల ఆవేదన. ఈ ప్రాజెక్టు యాజమాన్యానికి వైసీపీకి సంబంధాలున్నాయన్న మాట నిజం అనుకోనేలా ఉంది ఆయన స్పందన.కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ కొన్ని సందర్భాల్లో నేరుగా వెళ్లి మాట్లాడారు.